చాహల్ - ధనశ్రీ విడాకులు.. స్నేహితురాలి పోస్ట్ మీనింగ్?
ముఖ్యంగా ఈ పోస్ట్ టైమింగ్ చాలా సందేహాలకు తావిచ్చింది. ఆమె తమ జీవితాల గురించి రహస్య సందేశం అందించారా? అని మాట్లాడుకుంటున్నారు.;
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకుల ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో చాహల్ స్నేహితురాలు రేడియో జాకీ మహ్వాష్ సోషల్ మీడియాలో క్రిప్టిక్ పోస్ట్ తో ఆశ్చర్యపరిచారు. ఈ పోస్ట్ ఊహాగానాలను మరింత తీవ్రతరం చేసింది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చాహల్‌తో పాటు క్రికెటర్ స్టాండ్స్‌లో కనిపించిన తర్వాత మహ్వాష్ పోస్ట్ యువతరంలో వైరల్ గా దూసుకెళ్లింది. ముఖ్యంగా ఈ పోస్ట్ టైమింగ్ చాలా సందేహాలకు తావిచ్చింది. ఆమె తమ జీవితాల గురించి రహస్య సందేశం అందించారా? అని మాట్లాడుకుంటున్నారు.
ఆర్జే మహ్వాష్ ఇన్ స్టాలో ఇలా పోస్ట్ చేసారు. ``అబద్ధాలు, దురాశ , మోసానికి అతీతంగా... దేవుని దయ వల్ల మేం ఇంకా నిలబడి ఉన్నాము!`` అని క్రిప్టిక్ గా వ్యాఖ్యానించారు. మోసం, అబద్ధం అనే పదాలు సూటిగా హృదయాలను తాకాయి. ఎవరు ఎవరిని మోసం చేసారు? ఎవరు అబద్ధాలు ఆడారు? అన్నది చర్చగా మారింది. చాహల్‌కి మద్ధతుగా ధనశ్రీపై మహ్వాష్ ఈ కామెంట్ చేసారా? అంటూ నెటిజనులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ధనశ్రీ మోసం చేసారా? అన్నది చర్చగా మారింది.
స్టేడియంలో చాహల్‌తో కలిసి కనిపించిన కొద్ది రోజులకే ఇప్పుడిలా అతడికి మద్ధతుగా తన ఉద్ధేశాన్ని షేర్ చేయడం ఆశ్చర్యపరిచేదే. మహ్వాష్‌తో కనిపించిన తర్వాత చాహల్ ఆమె పోస్ట్‌ను షేర్ చేసిన కొద్దిసేపటికే లైక్ చేయడం, ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. మహ్వాష్ పోస్ట్ సారాంశం చాహల్ తో ముడిపెట్టినదేనా? అనేది కొంత అస్పష్ఠంగా ఉంది. కానీ ఇది క్లిష్ఠమైన భావోద్వేగ సమయం. చాహల్, ధనశ్రీ ఇద్దరూ విడిపోవడానికి హైకోర్టు అన్ని అడ్డంకులను తొలగించింది. ఫ్యామిలీ కోర్ట్ లో ఆరు నెలల గడువు షీల్డ్ ని తొలగించింది. దీంతో ఇప్పుడు విడాకుల ప్రక్రియ వేగవంతం కానుంది. రూ.4.75 కోట్ల భరణం ధనశ్రీకి ఇచ్చేందుకు చాహల్ అంగీకరించినట్టు కూడా కథనాలొస్తున్నాయి. అందమైన అమ్మాయి మహ్వాష్ నిగూఢమైన వ్యాఖ్యలపై ఆన్‌లైన్ లో చర్చలు ఊపందుకుంటున్నాయి, చాహల్ వ్యక్తిగత జీవితంలోని పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.
ధనశ్రీకి చాహల్ టీషర్ట్ నేర్పించిన పాఠం:
ఈరోజు కీలక విచారణ కోసం కోర్టుకు హాజరైన చాహల్ అతడి స్నేహితుల బృందం ధరించిన టీషర్టులపై కోట్‌లు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇవి రొటీన్ కోట్స్ కావు. ఎదుటివారి నీతిని ప్రశ్నించేవి. చాహల్ టీ-షర్టుపైనా, అతడి స్నేహితుల టీ-షర్టుపైనా ముద్రించిన పరిభాష లో నిగూఢమైన సందేశం దాగి ఉంది. ``మీ వోన్ షుగర్ డాడీగా ఉండండి`` అనే క్రిప్టిక్ లైన్ ముద్రించిన టీషర్ట్ ని చాహల్ ధరించాడు. దీని ఉద్ధేశం తన జీవితకాల ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడిన ధనశ్రీని ప్రశ్నించడమేనని అంటున్నారు. చాహల్ అలాంటి ఉద్ధేశాన్ని వదులుకోవాలనే సందేశం ఇచ్చాడు. ఆసక్తికరంగా చాహల్ స్నేహితుడు ధరించిన టీ-షర్టుపై ``వారు వస్తారు.. వారు వెళతారు``అనే పదం ముద్రించి ఉంది. చాహల్, అతడి స్నేహితుల బృందం టైమింగ్ లో కోర్టు ఆవరణ కోసం ఎంపిక చేసుకున్న దుస్తులు, వాటిపై కోట్‌లు ఆశ్చర్యపరిచాయి. ఇవి చాలా పవర్‌ఫుల్ గా కనిపించాయి.
చాహల్ నుంచి విడిపోయినా స్వతంత్య్రంగా సంపాదించుకునే తెలివితేటలు, ఇన్ ఫ్లూయెన్సర్ గా మంచి వృత్తి ధనశ్రీకి ఉన్నాయి. కానీ ఇంకా అతడి నుంచి డబ్బు ఆశించింది. చివరకు చాహల్ 4.75 కోట్లు తనకు చెల్లించేందుకు అంగీకరించినట్టు కథనాలొచ్చాయి. కేవలం 18 నెలల కాలంలోనే ఈ జంట బంధం బ్రేక్ అయింది. ధనశ్రీ ఇప్పటికే ఈ కేసులో భరణం కోరింది. దానికి కోర్టులోనే టీషర్ట్ పై కొటేషన్ రూపంలో చాహల్ పంచ్ ఇచ్చాడు.