అఖండ 2 కోసం ఆమెను దించుతున్నారా.. ప్లాన్ అదుర్స్..!

అంతేకాదు అఖండ 2 లో హీరోయిన్ గా కూడా కత్రినా కైఫ్ ని తీసుకొచ్చేలా చూస్తున్నారట.

Update: 2024-08-12 06:16 GMT

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 109వ సినిమా కె ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి చేయగానే నెక్స్ట్ వెంటనే అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. బోయపాటి శ్రీను ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లాక్ చేయగా అఖండ 2 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తైనట్టు తెలుస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకు వెళ్తున్న అఖండ 2 కాస్టింగ్ గురించి ఫ్యాన్స్ అంతా హుషారెత్తించే అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. అఖండ 2 ని ముందు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్టుగానే కాస్టింగ్ ఉండబోతుందని తెలుస్తుంది.

 

అఖండ 2 సినిమా లో విలన్ గా బాలీవుడ్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ ని తీసుకుంటారని టాక్. ఇప్పటికే పూరీ డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ విలన్ గా చేశాడు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో కూడా అందుకు రెడీ అంటున్నాడు. అంతేకాదు అఖండ 2 లో హీరోయిన్ గా కూడా కత్రినా కైఫ్ ని తీసుకొచ్చేలా చూస్తున్నారట. బాలకృష్ణతో కత్రినా కైఫ్ 20 ఏళ్ల క్రితం అల్లరి పిడుగు సినిమాలో నటించింది. ఇప్పుడు మళ్లీ అఖండ 2 కోసం కత్రినాను దించాలని చూస్తున్నారు. అదే జరిగితే సౌత్ తో పాటు హిందీలో కూడా అఖండ 2 పై క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.

ఐతే ఆఫ్టర్ మ్యారేజ్ కత్రినా గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వస్తుంది. అమ్మడు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తూ వస్తుంది. ఐతే అఖండ 2 లో కత్రినాని అటు గ్లామర్ పరంగా కూడా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారట. మల్లీశ్వరి, అల్లరి పిడుగు ఇలా రెండు సినిమాలతోనే తెలుగు ఆడియన్స్ కు తన టాలెంట్ చూపించిన కత్రినా మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

అఖండ 2 పై ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలకు తగినట్టుగానే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయబోతున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ నటీనటులు కూడా ఇందులో భాగం అవుతున్నారు కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అఖండ 2 మ్యూజిక్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. అఖండ 2 ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ ప్రకటించి సినిమాను కూడా జెట్ స్పీడ్ లో చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News