విజయ్ ఆఖరి సినిమా.. ఇదెక్కడి రెమ్యునరేషన్ సార్

లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటి అంటే తన 69వ సినిమాకు విజయ్ ఊహించని స్థాయిలో 250 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు బలమైన టాక్ వినిపిస్తోంది.

Update: 2024-04-03 14:30 GMT

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో ఎక్కువగా ప్రభాస్ పేరు వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇటీవల తమిళ హీరో విజయ్ కూడా ఆ లిస్టులో చేరిపోయాడు. అతని సినిమాలు ఇంకా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఉండకపోయినప్పటికీ కేవలం సౌత్ మార్కెట్ దృష్టిలో ఉంచుకొని అందరికంటే ఎక్కువ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఒక విధంగా విజయ్ క్రేజ్ కూడా ఆ స్థాయిలో ఉంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. నిర్మాతలు కూడా అతను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి భారీ సినిమాలను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక విజయ్ ఈ పర్ఫెక్ట్ టైమ్ లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సినిమాలకు స్వస్తి చెప్పనున్నట్లుగా ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన 68వ సినిమా GOAT ను ఏజీఎస్ ప్రొడక్షన్లో చేస్తున్నాడు.

ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక చివరిగా 69వ సినిమాను తెలుగు నిర్మాత డివివి దానయ్యతో చేయడానికి ఒప్పుకున్నట్లుగా చాలా రోజులుగా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఇదే విజయ్ చివరి సినిమా అయ్యి ఉండవచ్చు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమాకు H వినోత్ దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇక విజయ్ వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రెగ్యులర్ పాలిటిక్స్ లో బిజీ కాబోతున్నాడు. వీలైనంత త్వరగా 69వ సినిమాను పూర్తిచేసి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఆయన పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తమిళ మీడియాలో టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.

ఇక ఈలోపు చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఫినిష్ చేసుకోవాలి అని చూస్తున్నాడు. లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటి అంటే తన 69వ సినిమాకు విజయ్ ఊహించని స్థాయిలో 250 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు బలమైన టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే GOAT సినిమాకు గాను అతని రెమ్యూనరేషన్ 150 కోట్లు అందుకుంటున్నట్లుగా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

ఇక ఇప్పుడు ఆ లెక్క తదుపరి సినిమాకు 250 కోట్లకు చేరింది అని చర్చించుకుంటున్నారు. విజయ్ ఆఖరి సినిమా కావడం వల్ల బిజినెస్ హై రేంజ్ లో ఉంటుందనే విషయం నిర్మాతకు బాగా తెలుసు. ఇక అందుకే అడిగినంత ఇస్తున్నారని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే విజయ్ 69వ సినిమాకు DVV దానయ్య మాత్రమే కాకుండా ఏజిఎస్ ప్రొడక్షన్ కూడా సహనిర్మాతగా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News