విడాకుల వార్తలకు చెక్ పెట్టిన హార్థిక్ సోదరుడు!
పూర్తి వివరాల్లోకి వెళితే.. అన్నా వదినలపై పుకార్ల నడుమ హార్థిక్ బ్రదర్ క్రునల్ పాండ్యా తన అన్నా వదినల కుమారుడు అగస్త్య పాండ్యా.. అతడి వయసున్న మరో చిన్నారితో కలిసి ఆనందంగా ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసారు.
హార్దిక్ పాండ్యా - నాటాషా స్టాంకోవిక్ జంట విడాకుల గురించి రోజుకో కథనం వెలువడుతోంది. ఇంతకుముందు నటాషా స్టాంకోవిక్ కి హార్థిక్ ఆస్తుల్లో 70శాతం చెల్లించుకోవాలంటూ ఒక ప్రచారం వేడెక్కించింది. ఇంతలోనే తన ఆస్తుల్లో 50శాతం తల్లి పేరు మీదనే ఉన్నాయని హార్థిక్ వివరిస్తున్న ఓ త్రోబ్యాక్ వీడియో వైరల్ అయింది. విడిపోతున్నారన్న పుకార్ల నడుమ నటాషా స్టాంకోవిక్ స్వీయ-ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. నటాసా స్టాంకోవిక్ `పాండ్యా`ను తన ఇంటిపేరును తన సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించడంతోనే ఈ గాసిప్పులు పుట్టుకొచ్చాయి. స్టేడియంలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లలో హార్జిక్‌కు మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ వచ్చే నటాసా ఈసారి టోర్నీ ఆద్యంతం మ్యాచ్‌లలో అస్సలు కనిపించలేదు. వారు ఒకరికొకరు సోషల్ మీడియాల్లో టచ్ లో లేరు. వారి పోస్ట్‌లపై వ్యాఖ్యానించలేదు. రొటీన్ కి భిన్నంగా ప్రవర్తించారు.
డౌట్లు పెట్టిన నటాషా పోస్ట్:
నటాషా- హార్దిక్ బ్రేకప్ పై ఇన్ని వార్తలు వస్తున్నా కానీ దానికి ఈ జంట స్పందించకపోవడానికి కారణమేమిటో అర్థం కాలేదు.తన భర్తపై జరుగుతున్న ట్రోలింగుకి నటాషా స్పందించకూడదని భావించారట. అందువల్ల కొంతకాలం పాటు వారు ఏ ఫోటోలు లేదా వీడియోలను పోస్ట్ చేయవద్దని ఈ జంట నిర్ణయించుకున్నారని తెలిసింది. తద్వారా నటాషా అన్ని సోషల్ మీడియా ట్రోల్‌ల నుండి తప్పించుకోవచ్చు.
అయితే విడిపోతున్నారు అన్న పుకార్ల నడుమ ఇప్పుడు ఊహించని ఝలక్ ఇచ్చాడు హార్థిక్ సోదరుడు క్రునల్ పాండ్య. పూర్తి వివరాల్లోకి వెళితే.. అన్నా వదినలపై పుకార్ల నడుమ హార్థిక్ బ్రదర్ క్రునల్ పాండ్యా తన అన్నా వదినల కుమారుడు అగస్త్య పాండ్యా.. అతడి వయసున్న మరో చిన్నారితో కలిసి ఆనందంగా ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసారు. క్రునల్ ఈ పోస్ట్ కు `హ్యాపీ ప్లేస్` అని ఈమోజిలను షేర్ చేసారు. క్రునల్ తన అన్న కుమారుడు అగస్త్య సరదాగా టైమ్ పాస్ చేస్తుండడం కనిపించింది. ఈ విలువైన క్షణాలు హార్థిక్ అభిమానుల ముఖాలపై చిరునవ్వు తెచ్చాయి. నటాషా ఈ పోస్ట్‌పై హార్ట్ అండ్ ఐ ఎమోజీలతో వ్యాఖ్యానించారు.
ఇటీవల గాసిప్పుల నడుమ నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో తన వ్యాయామ సెషన్ నుండి ఒక వీడియోను పంచుకుంది. శుక్రవారం నాడు హైడ్రేటింగ్ ఐ- పాచెస్ ధరించి ఆ ఫోటోని షేర్ చేసింది. మరొక స్నాప్‌లో నటాషా తన లుక్ కి సంబంధించిన సెల్ఫీని షేర్ చేసింది. దీనర్థం సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం అని నెటిజనులు భావించారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా - నటాసా స్టాంకోవిక్ 31మే 2020 న వివాహం చేసుకున్నారు. వారి వ్యక్తిగత జీవితంలో కలతల కారణంగా ఇద్దరూ వార్తల్లో ఉన్నారు. నెటిజనులు నటాషా సోషల్ మీడియా కార్యకలాపాలను గమనించారు. వారి మధ్య సఖ్యత లేదని గుర్తించారు. వెంటనే విడాకుల పుకార్లు వైరల్ చేసారు.