అమరావతిలో కల్కి ఈవెంట్‌పై ఈ ప్రచారం నిజమా?
ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ రద్దయిందని, అమరావతిలో కాకుండా హైదరాబాద్ లోనే ప్రీరిలీజ్ వేడుక జరుగుతుందని ఫిలింనగర్ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ అత్యంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ హాజరవుతారని ప్రచారం సాగుతోంది. నూతన రాజధాని అమరావతి పేరు దేశమంతా మార్మోగేలా ఈవెంట్ ని ప్లాన్ చేయాలని అశ్వనిదత్ భావిస్తున్నారని కథనాలొస్తున్నాయి.
అయితే ఇంతలోనే దీనికి విరుద్ధమైన వార్త అందింది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ రద్దయిందని, అమరావతిలో కాకుండా హైదరాబాద్ లోనే ప్రీరిలీజ్ వేడుక జరుగుతుందని ఫిలింనగర్ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ గాసిప్పుల సారాంశం ఇలా ఉంది. ఒకవేళ అశ్వనిదత్ బృందం అమరావతిలోనే కల్కి ఈవెంట్ నిర్వహిస్తే అది కచ్ఛితంగా రాజకీయ రంగు పులుముకుంటుందని, అది తనకు ఎంత మాత్రం నచ్చదని ప్రభాస్ నేరుగా చిత్రనిర్మాత అశ్వనిదత్ కి విన్నవించారని, దీంతో ఆలోచన మారిందని కూడా గుసగుస వినిపిస్తోంది.
ప్రభాస్ ఆలోచనాత్మక నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ సంస్థ అమరావతిలో జరగాల్సిన ఈవెంట్‌ను రద్దు చేసి హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేసిందని కూడా ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. సినీపరిశ్రమను రాజకీయం చేయడం తగదు. సినీహీరోలకు రాజకీయ రంగు పులమడం వలన తీరని నష్టం ఏర్పడుతోంది. ఇప్పుడు ప్రభుత్వం మారి ఉండొచ్చు. ఐదేళ్ల తర్వాత రానున్న ప్రభుత్వం ఏదో ఇప్పుడే ఊహించలేం. అప్పుడు మళ్లీ కక్ష సాధింపులకు పాల్పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? పెద్ద సినిమాల్లో నటించే హీరోలకు ఇది ఎప్పుడూ టెన్షన్ తో కూడుకున్నది. గత ప్రభుత్వ సాధింపుల వల్ల మెగా హీరోల సినిమాలతో పాటు, పరిశ్రమకు చాలా నష్టం వాటిల్లింది. అందువల్ల రాజకీయాలతో సంబంధం లేకుండా సామరస్యంగా తమ సినిమాలను ముందుకు నడిపించుకోవాలసిన అవసరం ఆవశ్యకతను ప్రభాస్ గుర్తించాడని సన్నిహితులు భావిస్తున్నట్టు తెలిసింది.