ఎసిడిటీకి తిరుగులేని మందు !

మన జీవన శైలితో పాటు మారిన ఆహారపు అలవాట్లు ఎక్కువ మందికి ఎసిడిటీ వంటి దీర్ణ సమస్యతో బాధపడుతున్నారు.

Update: 2024-05-21 23:30 GMT

మన జీవన శైలితో పాటు మారిన ఆహారపు అలవాట్లు ఎక్కువ మందికి ఎసిడిటీ వంటి దీర్ణ సమస్యతో బాధపడుతున్నారు. దీని మూలంగా కడుపు, ఛాతీలో అసౌకర్యం కలిగి అజీర్తికి కారణం అవుతుంది. మోతాదుకు మించి తినటం, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, కారం ఎక్కువ ఉన్నవి తినటం, ధూమపానం, మద్యపానం కూడా ఎసిడిటీ రావడానికి కారణమవుతున్నాయి.

అయితే చల్లటి పాలు ఎసిడిటీకి సింపుల్ సొల్యూషన్ అని చెబుతున్నారు. పాలలోని కాల్షియం కడుపులోని యాసిడ్​ను తగ్గించడానికి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడానికి సాయపడుతుంది. కాబట్టి ఒక గ్లాసు చల్లటి పాలు తాగితే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.

ఇక వీటితో పాటు అల్లం టీ, అల్లం జ్యూస్, భోజనానికి ముందు ఒక గ్లాసు కలబంద జ్యూస్ తాగడం, ఒక గ్లాసు నీటిలో 1-2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి భోజనానికి ముందు తాగడం, భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలు తినడం, గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం, రోజూ ఒక అరటిపండును తినడం ద్వారా ఎసిడిటీ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News