గుడ్ న్యూస్: నాడు పవన్ హామీ.. నేడు చంద్రబాబు ఉత్తర్వ్యులు!
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో ఎంఎస్ నెంబర్ 156తో ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు కీలక హామీలను అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని అంటున్నారు. ఇప్పటికే పెన్షన్, ఉచిత గ్యాస్ వంటి హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని అమలుచేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వ్యులు జారీ చేసింది. దీంతో.. పవన్ హామీని నిలబెట్టేలా బాబు ఉత్తర్వ్యులు ఇచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును.. గత ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ ఎన్నో హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి.. 30 పడకల కమ్యునిటీ హెల్త్ సెంటర్ ని కాస్తా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మారుస్తానని! ఇలా నాడు పిఠాపురం ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టేలా తాజాగా కూటమి ప్రభుత్వం నుంచి ఉత్తర్యులు జారీ అయ్యాయి.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో ఎంఎస్ నెంబర్ 156తో ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా... పిఠాపురం 100 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన కోసం 38.32 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నిధులను ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, మొదలైన ప్రత్యేకమైన సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తారు.
ఈ సందర్భంగా... ఈ ఆస్పత్రిలో జనరల్ సర్జన్ తో పాటు కంటి వైద్యం, ఆర్థోపెడిక్స్, చెవి-ముక్కు-గొంతు (ఈ.ఎన్.టీ) నిపుణులతో పాటు డెంటల్, రేడియాలజీ వంటి విభాగాలు రానున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో... పెరగనున్న ఆస్పత్రి సమర్థ్యానికి అనుగుణంగా సుమారు 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమిస్తారని అంటున్నారు. వీరిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఉండనున్నారు!
ఫలితంగా... త్వరలో పిఠాపురం నియోజకవర్గంలోని ఆస్పత్రి సామర్ధ్యం పెరగడంతోపాటు ప్రత్యేక సౌకర్యాలు, అదనపు సిబ్బంది రానున్నారని.. నియోజకవర్గ ప్రజలకు ఇకపై పూర్స్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు.