13 ఏళ్ల డేనియల్.. పవర్ ఫుల్ సీఐఏ ఏజెంట్.. ఇది ట్రంప్ ఆర్డర్
సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)... ప్రపంచంలోనే పవర్ ఫుల్. ఈ అమెరికా నిఘా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా కళ్లుంటాయి.;
సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)... ప్రపంచంలోనే పవర్ ఫుల్. ఈ అమెరికా నిఘా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా కళ్లుంటాయి. తమ శత్రువును వేటాడి మరీ హతం చేస్తుంది.. సీఐఏ ఏజెంట్ అంటే జేమ్స్ బాండ్ తరహాలో ఉంటారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి అప్పగించిన టాస్క్ ను పూర్తి చేస్తారు. ఇప్పుడు ఆ సీఐఏకు ఓ 13 ఏళ్ల బాలుడు ఏజెంట్ అయ్యాడు.
మహామహులు ఉండే సీఐఏలో.. డేగ కళ్లతో నిఘా కాసే సంస్థలో.. 13 ఏళ్ల కుర్రాడా? అదెలా సాధ్యమైంది? అంటే.. అంతా ట్రంప్ ఆర్డర్. యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా 13 ఏళ్ల టెక్సాస్ కుర్రాడు డేనియల్ ను నియమించారు ట్రంప్. ఇతడు కొన్నేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడి జయించినవాడు కావడం గమనార్హం. ఇదంతా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించారు ట్రంప్.
డీజే డేనియల్ 2018లో అరుదైన క్యాన్సర్ బారిన పడ్డాడు. అతడు బతికేది మరో ఐదు నెలలు మాత్రమే అని వైద్యులు తేల్చి చెప్పారు. కానీ, డేనియల్ కుంగిపోలేదు. వ్యాధితో ధైర్యంగా పోరాడాడు. పోలీస్ కావాలన్న తన కలను వదులుకోలేదు. ఫలితంగా పూర్తి ఆరోగ్యం సాధించాడు. అందుకే డేనియల్ ను యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా నియమించాలని.. సంస్థ డైరెక్టర్ సీన్ కరన్ ను ట్రంప్ కోరారు.
కాగా, ట్రంప్ ఈ ప్రకటన చేయగానే.. అధికార రిపబ్లికన్ సభ్యులంతా కాంగ్రెస్ లో లేచి నిల్చొని చప్పట్లు కొట్టి డేనియల్ ను అభినందించారు. ఈ నిర్ణయానికి చాలామంది డెమోక్రటిక్ సభ్యులూ మద్దతిచ్చారు.
ఇక ట్రంప్ తన కుమారుడిని సీఐఏ ఏజెంట్ గా ప్రకటించగానే డేనియల్ తండ్రి అతడిని ఎత్తుకుని సభకు చూపించడం భావోద్వేగాన్ని రేకెత్తించింది. సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్.. డేనియల్ దగ్గరకు వెళ్లి అధికారిక ఐడీ కార్డును అందజేయడం హైలెట్ గా నిలిచింది. దానిని చూసుకుని డేనియల్ మురిసిపోయాడు. ట్రంప్ నకు థ్యాంక్స్ తెలిపాడు.