21 మంది మైనర్లను నరకం చూపినోడికి మరణశిక్ష

పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ స్థానంలో ఉండి.. దుర్మార్గంగా వ్యవహరించిన కామాంధుడికి కోర్టు సంచలన తీర్పును ఇస్తూ

Update: 2024-09-27 04:38 GMT

చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ఆడ మగ అన్న పట్టింపు లేదు. ఆరేళ్ల నుంచి పదహారేళ్ల వయసు వారు కనిపిస్తే చాలు.. వాడిలో కామపిశాచి నిద్ర లేస్తుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ స్థానంలో ఉండి.. దుర్మార్గంగా వ్యవహరించిన కామాంధుడికి కోర్టు సంచలన తీర్పును ఇస్తూ.. మరణశిక్షను ఖరారు చేసింది. అసలేం జరిగిందంటే..

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకగా 21 మంది మైనర్లకు లైంగిక వేధింపులతో నరకం చూపిన ఒక వార్డెన్ కు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును ప్రకటించింది పోక్సో ప్రత్యేక న్యాయస్థానం. అరుణాచల్ ప్రదేశ్ స్కూల్లో వార్డెన్ గా వ్యవహరిస్తున్న యమ్ కెన్ బాగ్రా చేసిన దారుణ వేధింపులు వెలుగు చూశాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని శియోమీ జిల్లా కరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ లైంగిక దాడి జరిగింది.

తమ పన్నెండేళ్ల కవలల కుమార్తెలను హాస్టల్ వార్డెన్ యమ్ కెన్ బాగ్రా లైంగికంగా వేధిస్తున్నట్లుగా గత ఏడాది నవంబరులో బాధితురాలి తండ్రి ఒకరు కంప్లైంట్ చేశారు. దీంతో ధైర్యం తెచ్చుకున్న మరింత మంది బాధితులు ముందుకు వచ్చి.. వార్డెన్ దుర్మార్గాల గురించి బయట పెట్టటంతో పోలీసుల్ని అతడ్ని అరెస్టు చేశారు. ఇతడి దారుణాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో ప్రత్యేక దర్యాప్తు టీంలను ఏర్పాటు చేశారు. విచారణలో వార్డెన్ చేసిన దుర్మార్గాలు వెలుగు చూశాయి.

2019-22 మధ్య కాలంలో 21 మంది మైనర్లపై లైంగిక దాడులు.. వేధింపులకు పాల్పడిన వైనాన్ని మీడియాకు ఎస్పీ రోహిత్ రాబ్ బిర్ సింగ్ తెలిపారు. బాధితులంతా ఆరేళ్ల నుంచి పదహారేళ్ల లోపు వయసు వారు కావటం గమనార్హం. ఇతడి లైంగి వేధింపులకు బాధితులుగా ఆరుగురు బాలులు ఉన్న విషయం వెలుగు చూసింది.

లైంగిక దాడులకు పాల్పడటానికి ముందే వారికిఅశ్లీల వీడియోలు చూపించి మత్తుమందు ఇచ్చేవాడు. ఆ విషయాన్ని బయటపెడితే.. చంపేస్తానని బెదిరింపులకు దిగేవాడు. ఇతడి దుర్మార్గాల గురించి తెలిసి కూడా బయటపెట్టని ప్రిన్సిపల్ కు కు.. మహిళా హిందీ టీచర్ కు 20 ఏళ్ల చొప్పున కఠినకారాగార శిక్షను విధిస్తూ పోక్సో కోర్టు తీర్పును ఇచ్చింది. లైంగిక వేధింపుల ఉదంతంలో ఒకరికి మరణశిక్ష విధించటం ఇదేనని చెబుతున్నారు.

Tags:    

Similar News