ఔరంగజేబును ప్రశంసించిన అబూ అజ్మీ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

ఈ వ్యాఖ్యలు శాసనసభ సభ్యుడి హోదాకు తగినవి కావని, ప్రజాస్వామ్య సంస్థను అవమానించడం అన్నారని రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు.;

Update: 2025-03-05 11:32 GMT

మహారాష్ట్ర అసెంబ్లీలో తాజా పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన ఔరంగజేబును ప్రశంసిస్తూ, శంభాజీ మహారాజ్‌ను విమర్శించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలు శాసనసభ సభ్యుడి హోదాకు తగినవి కావని, ప్రజాస్వామ్య సంస్థను అవమానించడం అన్నారని రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఇవి మార్చి 26న ముగిసిపోతాయి. ఇటీవలి సభలో అజ్మీ ఔరంగజేబు పై ప్రశంసలు కురిపించారు. దీనికి ప్రతిస్పందిస్తూ బుధవారం అసెంబ్లీలో మంత్రి చంద్రకాంత్ టీర్మనాన్ని ప్రవేశపెట్టారు. "అజ్మీకి సభ్యత్వం రద్దు చేయాలి" అనే తీర్మానం సభలో ప్రవేశపెట్టగా, మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదించింది. దీంతో అజ్మీ శాసనసభ సభ్యత్వం రద్దయ్యింది.

అజ్మీ వ్యాఖ్యలు:

అజ్మీ ఔరంగజేబు పాలనలో భారతదేశ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ , బర్మా (మయన్మార్) వరకు విస్తరించినట్లు చెప్పారు. "మన జీడీపీ ప్రపంచ జీడీపీలో 24 శాతం వాటా కలిగింది. ఔరంగజేబు పాలనలో భారతదేశాన్ని బంగారు పిచ్చుక అని పిలిచేవారు," అని ఆయన పేర్కొన్నారు.

అజ్మీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చలను కలిగించాయి. పాలకపక్ష సభ్యులు ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార నేతలు అజ్మీ వ్యాఖ్యలు శాసనసభ సభ్యుడి హోదాకు తగినవి కాదని, ప్రజాస్వామ్య సంస్థను అవమానించారని ఆరోపించారు.

అజ్మీ వివరణ:

అజ్మీ తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అయితే అసెంబ్లీ లో కాకుండా, బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను సభలో తీసుకురావడం సరైనది కాదని తెలిపారు. ఔరంగజేబు గురించి చెప్పినది చరిత్రకారులు, రచయితలు చెప్పినదేనని ఆయన స్పష్టం చేశారు. తాను ఎవరి గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదని, అయితే తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే, వాటిని వెనక్కి తీసుకుంటానని అజ్మీ తెలిపారు.

Tags:    

Similar News