మాజీ మంత్రి జోగి రమేష్ కు బిగ్ షాక్!
అవును... వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలింది. ఇందులో భాగంగా విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం లోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చెలరేగిపోయారని.. ప్రధానంగా అప్పట్లో మంత్రులుగా ఉన్నవారి అక్రమాలకైతే అడ్డూ అదుపూ లేకుండా పోయిందనే విమర్శలు కూటమి పార్టీల నుంచి బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు.
అవును... వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలింది. ఇందులో భాగంగా విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం లోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ప్రధానంగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఫిర్యాదులు అందడం వల్లే ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు.
అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే ఆరోపణలను జోగి రమేష్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ భూములు సీఐడీ అధీనంలో ఉన్నప్పటికీ ఆయన వాటిని కొనుగోలు చేసి, భారీ ధరలకు విక్రయించారనే ఆరోపణలు గతంలో విపరీతంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో సుమారు ఐదు కోట్ల రూపాయలను ఆయన ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి.
అంబాపురంలో 69/2, 87 సర్వే నెంబర్లలోని సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉండగా.. దాన్ని గతంలో సీఐడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ భూమిని రమేష్.. తన సమీప బంధువుల పేరు మీదకు బదలాయించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం!