వీడియో వైరల్: అమ్మకానికి ఏఐ గర్ల్ ఫ్రెండ్... ధరల వివరాలివే!

గత కొంత కాలంగా టెక్నాలజీలో అత్యంత ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది తెలిసిన విషయమే.

Update: 2025-01-13 04:34 GMT

గత కొంత కాలంగా టెక్నాలజీలో అత్యంత ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏఐ అనేది ఓ అద్భుతం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది మనిషికి మనిషి అవసరాన్ని తీరుస్తుందనే చర్చా జరిగింది. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ గర్ల ఫ్రెండ్ అందుబాటులోకి వచ్చింది.

అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో టెక్నాలజీ అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ సమయంలో ఏఐ రోబోలు మానవుల భావొద్వేగాలను, భావాలను అర్ధం చేసుకోగలవని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఏఐ యాంకర్స్, న్యూస్ ప్రజెంటర్స్ ను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏఐ రోబోట్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చి హల్ చల్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా లాస్ వెగాస్ లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్ - 2025) లో అమెరికన్ టెక్ కంపెనీ రియల్ బోటిక్స్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ "అరియ" ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది అచ్చు మనిషిలాగానే ముఖ కవలికలను, వ్యక్తీకరణలను చూపించగలదని చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు రియల్ బోటిక్స్ సీఈఓ ఆండ్రూ కిగుయెల్ వివరించారు. ఇందులో భాగంగా... "మగవారి ఒంటరితనం సమస్య"కి ఇది ఒక పరిష్కారాన్ని అందించగలదని అన్నారు. ఈ రోబోటిక్ గర్ల్ ఫ్రెండ్ లో 17 మోటార్లు అమర్చగా.. ఇవి మెదడును కదిలించడంలోనూ, ఇతర కదలికలల్లోనూ సాయపడతాయి.

ఈ క్రమంలో... దాని జట్టు రంగు, హెయిర్ స్టైల్ మొదలైన వాటితో పాటు ముఖాన్ని మార్చవచ్చు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ అరియా ముఖ కవళికలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో అరియాకు సంబంధించిన మూడు వెర్షన్స్ ని ప్రవేశపెట్టినట్లు రియల్ బోటిక్స్ తెలిపింది. ఈ సందర్భంగా వాటి ధరల వివరాలు వెల్లడించింది.

ఇందులో భాగంగా... ఆ మూడు వెర్షన్స్ లో మొదటి దానిలో మెడపైన భాగం మాత్రమే అందుబాటులో ఉండగా.. దీని ధర 10,000 డాలర్లు (సుమారు రూ.8.60 లక్షలు) ఉంటుంది. ఇదే సమయంలో.. రెండో వెర్షన్ ధర రూ. 1.29 కోట్లు ఉంటుందని చెబుతుండగా.. ఫుల్ సైజ్ మోడల్ ని అందించే మూడో ఆప్షన్ ధర సుమారు రూ.1.50 లక్షలు అని అంటున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Tags:    

Similar News