మోడీ ర్యాంప్ వాక్.. చక్రాల కుర్చీలో జో బైడెన్... వీడియో వైరల్!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెరైటీ డిజైనర్ వేర్ ధరించి ర్యాంప్ వాక్ చేస్తే.. సంకెళ్లు చేతపట్టిన ట్రంప్ ఖైదీ దుస్తుల్లో కనిపిస్తే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెరైటీ డిజైనర్ వేర్ ధరించి ర్యాంప్ వాక్ చేస్తే.. సంకెళ్లు చేతపట్టిన ట్రంప్ ఖైదీ దుస్తుల్లో కనిపిస్తే.. మోడ్రన్ స్పేస్ సూట్ లో ఎలాన్ మస్క్ నడిచి వస్తుంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చక్రాల కుర్చీలో దర్శనమిస్తే.. ఇవన్నీ నిజజీవితంలో జరుగుతాయా లేదా అనేది సంగతి కాసేపు పక్కనపెడితే... కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ఓ వీడియో మాత్రం వైరల్ గా మారింది.
అవును... దేశాధినేతలు, ప్రపంచంలోని కుభేరులు, ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రధానులు ఫ్యాషన్ దుస్తులు ధరించి, ర్యాంప్ వాక్ చేస్తుంటే ఎలా ఉంటుందనే ఆలోచనకు ప్రతి రూపమో ఏమో కానీ... ఇప్పుడు ఓ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో అయితే సందడే సందడి వాతావరణం నెలకొంది.
ఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షులు ట్రంప్, బరక్ ఒబామా, యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జొంగ్ ఉన్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో మొదలైన పలువురు దేశాధినేతలు ఈ వీడియోలో కనిపించారు.
వీరితో పాటు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ లతో పాటు పోప్ ఫ్రాన్సిస్ సైతం ఈ వీడియోలో ర్యాంప్ వాక్ చేస్తూ కనిపిస్తుండటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను టెస్లా చీఫ్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారింది.
అయితే... ఇది ఫేక్ వీడియో అనే విషయం దీనిపై ఓ లుక్కు వేసిన వెంటనే ఇట్టే అర్ధమైపోతుంది. ఇది తాజా టెక్నాలజీ సంచలనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెర్ఫార్మెన్స్ ని ప్రతిరూపం!!