ప్రపంచ యుద్ధంపై ఏఐ... తెరపైకి భారత్-పాక్ ఇష్యూ!

ఇదే సమయంలో ఉత్తర కొరియా తరచూ నూతన క్షిపణులను పరీక్షిస్తుండటం.. వీళ్లకూ రష్యాకు మాంచి అవినాభావసంబంధం ఉండటంతో ఈ చర్చ ఇంకాస్త బలంగా జరుగుతుంది.

Update: 2024-01-27 14:35 GMT

గత కొంతకాలంగా మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన చర్చ బలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రష్యా – ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఈ చర్చ కాస్త ఎక్కువగా సాగగా.. హమాస్ – ఇజ్రాయేల్ యుద్ధం జరిగిన తర్వాత దీని తీవ్రత మరింత పెరిగింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా తరచూ నూతన క్షిపణులను పరీక్షిస్తుండటం.. వీళ్లకూ రష్యాకు మాంచి అవినాభావసంబంధం ఉండటంతో ఈ చర్చ ఇంకాస్త బలంగా జరుగుతుంది. ఈ సమయంలో మూడో ప్రపంచ యుద్ధంపై ఏఐ వెర్షన్ తెరపైకి వచ్చింది.

అవును... త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలున్నాయంటూ ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన ‍వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తన చాట్‌ జీపీటీలో మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అంచనాలను వెల్లడించింది. ఇందులో భాగంగా... మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవ్వడానికి కారణాలుగా నిలిచే ఆరు దేశాలు ఇవేనంటూ తన భవిష్యవాణిని వెల్లడించింది. ఈ సందర్భంగా ఎంచుకున్న దేశాలు, ప్రస్థావించిన అంశాలు కూడా ఈ జోస్యానికి దగ్గరగా ఉండటం గమనార్హం.

ఇందులో భాగంగా... మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ఆరు దేశాలు ఇవేనంటూ చాట్ జీపీటీ ప్రస్థావించిన, జోస్యం చెప్పిన విషయాల్లో భారతదేశం పేరు కూడా ఉండటం గమనార్హం. భారత్ - పాక్ మధ్య దశాబ్ధాలుగా జరుగుతున్న రచ్చ కూడా మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అవ్వొచంటూ చాట్ జీపీటీ జోస్యం చెప్పింది. ఇదే సమయంలో అది ప్రస్థావించిన ఇతర సమస్యలు కూడా ఆసక్తికరంగా మారాయి.

తాజాగా మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, అందుకు గల కారణాలను గురించి తెలియజేయాలని చాట్‌ జీటీపీ ని అడగగా... అది ఆరు హాట్‌ స్పాట్‌ లను వెల్లడించింది. ఈ క్రమంలో... ఈ ఆరు ప్రాంతాలు.. వీటివల్ల ప్రపంచ యుద్ధం తలెత్తడానికి అవకాశం ఉన్న ఘర్షణ పాయింట్లు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం...!

ఇందులో భాగంగా... "మిడిల్ ఈస్ట్" ప్రస్థావనను చాట్ జీపీటీ తెరపైకి తెచ్చింది. వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ లో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం ఇంకా కొలిక్కి రాలేదు సరికదా.. ఈ సమయంలో ఈ సమస్య మరిన్ని దేశాలకు విస్తరించడం మొదలుపెట్టింది. ఇంకోపక్క సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇది ఎప్పుడైనా ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని చెబుతుంది.

ఇదే సమయంలో మాటమాటకీ నూతన క్షిపణులను పరీక్షిస్తూ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్న "ఉత్తర కొరియా" ప్రస్థావనను కూడా చాట్ జీపీటీ తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో... ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పైగా ఈ వివాదంలో అమెరికా ఎంటరవ్వడం, మరోపక్క ఉత్తర కొరియాకు చైనా తదితర దేశాల నుంచి మద్దతు ఇస్తుండటంతో మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడ నుంచి ఎప్పుడైనా మొదలు కావొచ్చని చెబుతుంది.

అదేవిధంగా... "చైనా, తైవాన్" మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తత మరిన్ని మలుపులు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో... ఈ విషయాలనూ ప్రస్థావించిన చాట్ జీపీటీ... ఈ వ్యవహారంపై అమెరికా దృష్టి సారించడంతో పరిస్థితిని మరింత దిగజారుతోందని.. ఆసియా - పసిఫిక్‌ కు చెందిన ఈ ప్రాంతంలో ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం తలెత్తే అవకాశాలున్నాయని వెల్లడించింది.

ఇక ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్న తూర్పు "ఐరోపా ప్రాంతాలు"... రష్యా, ఉక్రెయిన్, నాటోకు సంబంధించిన ఘర్షణల కారణంగా తూర్పు ఐరోపాలో ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతుండటంతో... ఇది ఎప్పుడైనా తీవ్ర ఘర్షణలకు దారితీయవచ్చని చాట్ జీపీటీ అభిప్రాయపడింది. ఇదే సమయంలో దక్షిణ చైనా సముద్రం వ్యవహారంతో పాటు ఇండియా - పాక్ మధ్య కొనసాగుతున్న పరిస్థితులు కూడా మూడో ప్రపంచ యుద్ధానికి కారణం కావొచ్చని అభిప్రాయం వ్యక్తమయ్యింది.

ఇందులో భాగంగా... దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా, దాని పొరుగు దేశాల మధ్య నిరంతర వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసింది. వాటికి తోడు అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఈ సమస్యకు ఆజ్యం పోస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యమంలో... ఇక్కడి ఉద్రిక్తతలు ఎప్పుడైనా తీవ్రస్థాయికి చేరుకోవచ్చని.. ఫలితంగా మూడవ ప్రపంచ యుద్ధం ఇక్కడి నుంచే మొదలయ్యే అవకాశం కూడా ఉందని చాట్ జీపీటీ అభిప్రాయపడింది.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్... భారత్ – పాక్ మధ్య దదశాబ్దాలుగా ఉద్రిక్తత కొనసాగుతుండటం.. సరిహద్దుల్లో తరచూ కాల్పులు జరుగుతుండటంతో పాటు ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య రెండు సార్లు యుద్ధం జరగడం వంటి విషయాలను ప్రస్థావించడంతోపాటు.. ఈ రెండు దేశాలకు అణు సామర్థ్యం ఉందని గుర్తు చేస్తున్న చాట్ జీపీటీ... ఇక్కడ నుంచి కూడా మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.


Tags:    

Similar News