టీడీపీ మంత్రులు మొత్తం లోకేష్ ఇంట్లో !
టీడీపీ కూటమిలో ఉన్న మొత్తం 20 మంది టీడీపీ మంత్రులలో లోకేష్ ని మినహాయిస్తే మిగిలిన పందొమ్మిది మంది ఆయన ఇంటికి వెళ్ళారు.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే ఉంది. రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాహాటంగా హోం మంత్రి పనితీరు మీద చేసిన విమర్శలు ఒక ఎత్తు అయితే లేటెస్ట్ గా మరో డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వంలో జరిగింది. టీడీపీ కూటమిలో ఉన్న మొత్తం 20 మంది టీడీపీ మంత్రులలో లోకేష్ ని మినహాయిస్తే మిగిలిన పందొమ్మిది మంది ఆయన ఇంటికి వెళ్ళారు.
అందులో సీనియర్లు అయిన అచ్చెన్నాయుడు, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్ధసారధి వంటి వారు ఉన్నారు. వారితో పాటు కొత్తగా మంత్రులు అయిన వారు అంతా లోకేష్ ని కలిశారు. అందరూ కలసి బొకే ఇచ్చి లోకేష్ ని అభినందించారు.
లోకేష్ ఇటీవల వారం రోజుల పాటు అమెరికా పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు భారీ సంస్థలను కలిశారు. బిగ్ షాట్స్ అయిన బిజినెస్ పీపుల్ ని కలసారు. వారితో ఆయన ఏపీలో పెట్టుబడుల గురించి చర్చించారు.
ఏపీకి వస్తే ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఉందని దాంతో వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. లోకేష్ అమెరికా టూర్ అయితే సక్సెస్ అయింది అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక ఆయన జరిపిన భేటీలు నిర్వహించిన మీటింగుల వల్ల పెట్టుబడులు భారీగానే వస్తాయని అంటున్నారు.
దాంతో లోకేష్ ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను తెస్తున్నారు అని టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు వెల్లువలా చెబుతున్నారు. ఇక మొత్తం టీడీపీకి చెందిన మంత్రులు అంతా లోకేష్ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా ఆయనను కంగ్రాట్స్ చేయడం ఇపుడు చర్చకు తావిస్తోంది.
లోకేష్ టీడీపీలో భావి నాయకుడిగా ఉన్నారు. ప్రభుత్వంలో అయితే ఆయన అటు చంద్రబాబు ఇటు పవన్ తో సమానంగా ఉన్నారు. దాంతో పాటు ఆయన ప్రాముఖ్యత అంతకంతకు పెరుగుతోంది అని అంటున్నారు. దానికి ఉదాహరణగానే లోకేష్ నే ఫ్యూచర్ లీడర్ అని భావించి మొత్తం టీడీపీ మంత్రులు అంతా ఆయన ఇంటికే వెళ్లారా అన్న చర్చ కూడా నడుస్తోంది.
టీడీపీలో లోకేష్ ఈ రోజు పవర్ ఫుల్ లీడర్ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నా టీడీపీ పెద్దన్నగా ఉంది. జనసేన బీజేపీలకు చెందిన మంత్రులు నలుగురు ఉన్నా 20 మంది దాకా మంత్రులు టీడీపీకి చెందిన వారే ఉండడం విశేషం. వీరిలో జూనియర్లు అంతా లోకేష్ ఎంపిక చేసిన వారే అని అంతా అప్పట్లో అనుకున్నది కూడా ప్రచారంలో ఉంది.
ఇపుడు చూస్తే సీనియర్ నేతలు అంతా కూడా లోకేష్ తో కనిపించడంతో చంద్రబాబు తరువాత లోకేష్ అని పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అర్ధం అయింది అని అంటున్నారు. అది ఒక సంకేతంగా జనంలోకి పంపించడానికేనా ఇదంతా అని కూడా చర్చిస్తున్నారు. మొత్తం మీద లోకేష్ కి అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలోనూ ఎదురు లేదని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో టీడీపీ కూటమిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.