"ఆల్ ఐస్ ఆన్ రఫా"... ఎక్స్, ఇన్ స్టాలో సరికొత్త రికార్డ్!
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతోన్న భీకరపోరులో సాదారణ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతోన్న భీకరపోరులో సాదారణ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో చిన్నారులు, మహిళలతో సహా సుమారు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
పైగా ఆ ప్రాంతాన్ని సేఫ్ జోన్ గా ప్రకటించి కూడా ఇజ్రాయేల్ దాడి చేసిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన అంతర్జాతీయ సమాజాన్ని కలచివేసింది. దీంతో... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు.. "ఆల్ ఐస్ ఆన్ రఫా" ఇమేజ్ ను షేర్ చేస్తూ.. వారి నిరసనను తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా వేదికగా సరికొత్త రికార్డులు సృష్టించింది.
అవును... ఆదివారం రాత్రి ఇజ్రాయేల్ జరిపిన వైమానిక దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో... ఇప్పటికే 10 లక్షల మంది పాలస్తీనా పౌరులు రఫాను వీడారు. ఈ సమయంలో "ఆల్ ఐస్ ఆన్ రఫా" ఇమేజ్ ను ఇన్ స్టాగ్రాంలో సుమారు 45 మిలియన్ల మంది షేర్ చేశారు. ఇది సరికొత్త రికార్డ్ అని చెబుతున్నారు.
ఇదే సమయంలో... గడిచిన మూడురోజుల్లోనూ రఫా ఘటనకు సంబంధించి "ఎక్స్"లో సుమారు 27.5 మిలియన్ల మెసేజ్ లు పబ్లిష్ అయ్యాయని అంటున్నారు. దీంతో... రఫా పై ఇజ్రాయేల్ సైన్యం జరిపిన దాడులు అంతర్జాతీయంగా ఏ స్థాయిలో చర్చనీయాంశం అయ్యిందనే విషయం కళ్లకు కట్టినట్లు కనబడుతుందన్ని అంటున్నారు.
కాగా... అక్టోబరులో మొదలైన ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 36 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అంతకంటే ముందు ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడిలో సుమారు 1,160 మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మంది బందీలుగా మారారు. ఈ మృతులు, బాధితుల్లో చాలామంది సామాన్య పౌరులే ఉన్నారు.