కూటమి లాంగ్ లివ్ అంటున్న బాబు....గ్రౌండ్ రియాలిటీ వేరుగా !
టీడీపీ పుట్టాక ఆ పార్టీకి 2024లో వచ్చినన్ని సీట్లు గతంలో ఎపుడూ రాలేదు అంటే అది కూటమి కట్టిన గొప్పతనమే అని అంటారు.
తెలుగుదేశం కూటమి కట్టింది. బంపర్ విక్టరీ కొట్టి అధికారం ఏపీలో చేపట్టింది. టీడీపీ పుట్టాక ఆ పార్టీకి 2024లో వచ్చినన్ని సీట్లు గతంలో ఎపుడూ రాలేదు అంటే అది కూటమి కట్టిన గొప్పతనమే అని అంటారు. టీడీపీ ఫార్టీ ఇయీర్స్ తన హిస్టరీలో ఎపుడూ గెలవని సీట్లను కూడా 2024లో గెలిచింది. ఆ విధంగా టీడీపీ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు కూటమి ఎంత బలంగా ఉందో అర్ధం అవుతుంది. కూటమితో కలిగే లాభాలు ఎన్నో అన్నది రాజకీయ చాణక్యుడు చంద్రబాబు కంటే తెలియని వారు ఎవరూ లేరు. అందుకే ఆయన పదే పదే కూటమి ఐక్యతను కోరుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టు పార్టీలు కూటమి కట్టి దశాబ్దాల తరబడి పాలించారు
అలా సీట్ల సర్దుబాటు చేసుకుని ఎవరు ఏమిటి ఎక్కడ అని కనుక కచ్చితమైన క్లారిటీ ఉంటే కూటమి సుదీర్ఘకాలం పాటు మనగలగడం ఖాయం. అలా కనుక ఏపీలో కూటమి ఉంటే సమీపంలోకి వచ్చే ప్రత్యర్థి పార్టీ కూడా మరోటి ఉండదు. సో చంద్రబాబు ఆలోచనలు చాలా ముందు చూపుతో సాగుతున్నాయి.
ఆయన ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక మీడియా మీట్ లో కూటమి ఎపుడూ కలిసే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేసారు. జమిలి ఎన్నికలు వచ్చినా లేక షెడ్యూల్ ప్రకారం 2029లో ఎన్నికలు జరిగినా కూడా కూటమిగానే తామంతా పోరాడుతామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అంటే కూటమి లాంగ్ లివ్ అని బాబు అంటున్నారు అన్న మాట. బాబు ఈ విధంగా చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏపీలో సామాజిక రాజకీయ సమీకరణలు అన్నీ కూటమికే అనుకూలంగా ఉన్నాయి. కూటమి కనుక విడిపోతే అది టీడీపీకే పెద్ద దెబ్బ. అందుకే బాబు కూటమికి గట్టిగా కోరుకుంటున్నారు.
అంతే కాదు కూటమిని ఎవరూ విడదీయలేరు అని బాబు అంటున్నారు. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూటమి చీలదని తాము అంతా ఒక్కటే అని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో రెండో మాట లేదు అని అంటున్నారు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ అధినాయకత్వం తో కూడా సామరస్యంగా ఉంటూ కూటమిని ఏపీ పాలిటిక్స్ లో ధీటుగా నిలబెడతామని బాబు పూర్తి ధీమాతో చెబుతున్నారు అని అనుకోవాలి.
ఇదిలా ఉంటే టీడీపీ కూటమిగానే ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు చెబుతున్న వేళ కూటమిలోని పార్టీల తీరు గ్రౌండ్ లెవెల్ లో ఎలా ఉందో అన్నది చూస్తే కనుక వారు అపుడే విడివిడిగానే అన్నట్లుగా ఉన్నారు. తమ సీట్లు తమ రాజకీయ అవకాశాలు కూటమి పార్టీలు తీసుకుంటున్నాయని టీడీపీ తమ్ముళ్ళు కలత చెందుతున్నారు. అదే టైంలో తమకు రావాల్సిన పదవులు టీడీపీ వల్ల తగ్గిపోతున్నాయని జనసేన భావిస్తోంది.
ఏపీలోని అనేక నియోజకవర్గాలలో టీడీపీ జనసేనల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాని వల్ల కూటమిలో కుంపట్లు స్పష్టంగా బయటపడుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే తమ నియోజకవర్గాన్ని త్యాగం చేశామని టీడీపీ తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికలు జరిగితే తామే ఆ సీటు నుంచి పోటీ చేస్తామని వారు ఆశాభావంతో ఉన్నారు. అయితే చంద్రబాబు ఈ మాటలు చెప్పడంతో తమ్ముళ్ళు ఆలోచనలలో పడుతున్నారు అని అంటున్నారు.
కూటమి లాంగ్ లివ్ అంటే తమ్ముళ్ళు ఎప్పటికీ త్యాగరాజులేనా అన్న మాట కూడా గ్రౌండ్ లెవెల్ లో వినిపిస్తోంది. ఇంకో వైపు చూస్తే జనసేన నుంచి కూడా అసంతృప్తి కనిపిస్తోంది. తాము పూర్తి స్థాయిలో అధికారం చేపట్టాలని, తమకు అవకాశాలు మరింతగా పెరగాలని వారు కోరుకుంటున్నారు. మరి కూటమి ఇలాగే పోటీ చేస్తే ఇవే సీట్లు దక్కుతాయి, మహా అయింతే మరిన్ని పెరుగుతాయి. అంటే జనసేనలో రాజకీయ అవకాశాలు ఇంతకంటే పెరగవా అన్న చర్చ కూడా తమ్ముళ్లలో ఉంది. మొత్తం మీద చూస్తే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం కూటమిలో కుమ్ములాటలు సాగుతున్నాయి.
కానీ పై స్థాయిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ సఖ్యతగానే ఉంటున్నారు. దాంతో కూటమి పటిష్టంగానే ఉంది, ఎప్పటికీ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ లో ఎవరైనా ఈ విధగ్నా అసంతృప్తి వ్యక్తం చేస్తే వారి ఆలోచనల మేరకు వారే నిర్ణయించుకోవాలి తప్పించి కూటమిలో మాత్రం ఇదే సీన్ ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు. సో పై స్థాయిలో ఉన్న కలివిడితనం ఐక్యత దిగువ స్థాయిలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.