ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్... ఎవరీ అపర కుబేరుడు?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌ ను సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కలిగి ఉన్నారు.

Update: 2023-09-14 00:30 GMT

ప్రపంచంలో ప్రైవేటు జెట్ లు కలిగిఉన్న వారూ అతి కొద్ది మందే అయినప్పటికీ... వారిలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న వ్యక్తి మాత్రం ఒక్కరే! ఈ జెట్ తో ముఖేష్ అంబానీకున్న స్పెషల్ ప్రైవేట్ జెట్ లు ఆరు కొనొచ్చంటే... దాని ధర ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అసలు దాని ధర ఎంత, ప్రత్యేకతలు ఏమిటి, యజమాని ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌ ను సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కలిగి ఉన్నారు. అత్యంత ఆస్తిపాస్తులు కలిగిన సుసంపన్నుడైన ఈ వ్యక్తి.. మధ్యప్రాచ్య రాజకుటుంబానికి చెందిన వారు. అతని నికర ఆస్తుల విలువ సుమారు రూ. 1.55 లక్షల కోట్లు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ కలిగిన వ్యక్తిగా ఈ సౌదీ అరేబియా యువరాజు, వ్యాపారవేత్త అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్‌ రికార్డుల్లోకెక్కారు. ఇతని వద్ద ప్రైవేట్ జెట్ బోయింగ్ 747 ఉంది. సాధారణంగా దీని విలువ 150 నుంచి 200 మిలియన్ డాలర్లు ఉంటుంది. కానీ ఈయాన వద్ద ఉన్న ఇదే విమానం విలువ మాత్రం 500 మిలియన్ కంటే ఎక్కువే!

అవును... సాధారణంగా 200 మిలియన్ డాలర్ల లోపు ఉండే ఈ ప్రైవేటు జెట్ విలువ ఏకంగా 500 మిలియన్ డాలర్లు. దానికి కారణం ఈ విమానంలో ఆయన చేసిన మార్పులు, లగ్జరీ ఏర్పాట్లే! ఈ విమానంలో ఒకేసారి 800 మందివరకూ ప్రయాణించవచ్చు! ఇంకా ఈ ప్రత్యేక ప్రైవేటు విమానంలో 10-సీటర్ డైనింగ్ హాల్, లగ్జరీ బెడ్‌ రూమ్, ప్రార్థన గది, హోమ్ థియేటర్ సిస్టమ్, స్పా ఉన్నాయి.

కాగా... ఇండియన్ బిలియనీర్ ముఖేష్ అంబానీ వద్ద రూ.603 కోట్ల విలువైన బోయింగ్ బిజినెస్ జెట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అదానీ గ్రూప్‌ కు చెందిన గౌతమ్ అదానీకి అనేక ప్రైవేట్ జెట్‌ లు ఉన్నాయి. వాటిలో బొంబార్డియర్ ఛాలెంజర్ 605, ఎంబ్రేయర్ లెగసీ 650, హాకర్ బీచ్‌ క్రాఫ్ట్ 850ఎక్స్.పి. ఉన్నాయి.

ఇదే క్రమంలో.. టాటా గ్రూప్‌ కు చెందిన రతన్ టాటా కి ఖరీదైన ప్రైవేట్ జెట్ మోడల్‌ లలో ఒకటైన డస్సాల్ట్ ఫాల్కన్ 2000 ఉంది. దీని ధర సుమారు 200 కోట్ల రూపాయలూ ఉంటుందని అంటారు. ఇదే క్రమంలో ప్రైవేట్ జెట్‌ లను కలిగి ఉన్న ఇతర ఫేమస్ బిలియనీర్లు ఎలోన్ మస్క్, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్.

Tags:    

Similar News