వీరింతే: మామూలుగా కాదు.. పక్కాగానే కోల్పోయారు!
సాధారణంగా రాజకీయాల్లో గెలుపు ఓటములు కామనే. అయితే.. ఓటమి వచ్చినప్పుడు తట్టుకుని నిలబ డాలి. గెలిచినట్టు వివేకంగా ముందుకు సాగాలి
సాధారణంగా రాజకీయాల్లో గెలుపు ఓటములు కామనే. అయితే.. ఓటమి వచ్చినప్పుడు తట్టుకుని నిలబ డాలి. గెలిచినట్టు వివేకంగా ముందుకు సాగాలి. కానీ, ఈ రెంటికి మధ్య ఉన్న ఆధిపత్య, అహంకార ధోరణు లు.. కొందరు నాయకులకు చాలానే కోల్పోయేలా చేశాయి. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు.. ఆమంచి బ్రదర్స్! ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన పేరున్న .. హవా చలాయించిన ఈ బ్రదర్స్.. తెర చాటున ఉన్నారు. ఇంకా వేచి చూస్తే.. తెరమరుగు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.
సర్వంసహా!
ఆమంచి స్వాములు, ఆమంచి కృష్ణమోహన్.. ఆది నుంచిఫైర్ బ్రాండ్సే. తొలుత కాంగ్రెస్ తర్వాత ఇండి పెండెంటుగా గెలిచిన ఆమంచి.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక, పార్టీలో ఆధిపత్య రాజకీయాలకు కేరాఫ్‌గా మారారనే టాక్ ఉంది. దీనిపై అనేక మంది చోటా నాయకు లు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. దీనికితోడు టీడీపీ నుంచి కరణం బలరాం.. వైసీపీ బాటపట్టడంతో తన పంథాను మార్చుకుని బలమైన శక్తిగా ఎదగాల్సిన ఆమంచి.. వ్యూహలోపంతో అల్లాడారు.
ఇది ఆమంచి రాజకీయాలను ప్రధాన దారి నుంచి పక్కదారి పట్టించింది. ఇక, ఆ తర్వాత.. మళ్లీ నియోజక వర్గం మార్పుపైనా దోబూచులాడారు. ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో పోయి పోయి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. కానీ, పరాజయం మూటగట్టుకున్నారు. స్థిరత్వం.. స్థితః ప్రజ్ఞత ఈ రెండు ఆమంచిలో వెతికినా కనిపించడం లేదన్న టాక్ వచ్చేలా చేసుకున్నారు. దీంతో ఆయన పరాభవం తర్వాత.. రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఎటు చూసినా.. దారి కనిపించడం లేదు.
ఇక, స్వాములు విషయానికి వస్తే.. గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నారన్న కారణంగా.. జనసేన లో చేరిన తర్వాత కూడా.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వాస్తవానికి ఆయన అక్కడే ఉండి ఉంటే.. గెలుపు గుర్రం ఎక్కేవారన్న చర్చ ఉంది. కానీ, ఈయన కూడా తొందరపడ్డారు. రాజకీయంగా ఆలోచనలేని స్టెప్ వేశారన్న వాదన కూడా ఉంది. దీంతో ఆమంచి తరహాలోనే స్వాములు కూడా ఎదురు చూపుల పరిస్థితికి వచ్చారు. సో.. వచ్చే 2025 అయినా.. మేలు జరగాలని వారి అనుచరులు కోరుకుంటున్నారు.