సీక్రెట్ అల్గారిథంతో అమెజాన్ మోసం... ఎలా, ఎంత అంటే...?

అమెజాన్‌ రిటైల్ పరిశ్రమలో లాభాలు పెంచుకోవడానికి సీక్రెట్ అల్గారిథం (ప్రాజెక్ట్‌ నెస్సీ) వినియోగించిందని యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గురువారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Update: 2023-11-04 23:30 GMT

ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ సృష్టించిన సంచలనాల సంగతి తెలిసిందే. ఆన్ లైన్ వ్యాపారాన్ని విపరీతంగా విస్తరించి, ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ దిగ్గజంగా నిలిచింది. ఈ సమయంలో ఈ సంస్థపై యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సంచలన ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా సుమారు రూ. 100 కోట్లకు పైగా సంపాదించిందని తెలిపింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది

అవును... అమెజాన్‌ రిటైల్ పరిశ్రమలో లాభాలు పెంచుకోవడానికి సీక్రెట్ అల్గారిథం (ప్రాజెక్ట్‌ నెస్సీ) వినియోగించిందని యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గురువారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అలా సీక్రెట్ అల్గారిథం ద్వారా ఏకంగా రూ.100 కోట్లు సంపాదించినట్లు పేర్కొంది. వాస్త్వానికి అమెజాన్‌ సంస్థకు సంబంధించిన కొన్ని అంశాలను పేర్కొంటూ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సెప్టెంబర్‌ లోనే కోర్టులో దావా వేసింది కానీ.. ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఈ సమయలో తాజాగా యూస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ తెరపైకి రావడంతో ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పిటిషన్ లో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... అమెజాన్ స్టోర్‌ ల్లో సుమారు ఒక బిలియన్ వస్తువులు ఉన్నాయని.. ఈ సమయంలో వినియోగదారుడికి తెలియకుండానే కొన్ని వస్తువుల ధరలు త్వరలో పెరుగనున్నట్లు ముందుగానే అంచనా వేసే అంతర్గత రహస్య అల్గారిథం ను సంస్థ ఉపయోగిస్తుందని పేర్కొంది.

ఇందులో భాగంగా... వస్తువులను ఎక్కడ అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందేమోనని ముందుగానే కొనుగోలు చేస్తున్నారని.. దీంతో కస్టమర్లలో ఆందోళన సృష్టిస్తున్నారని.. ఫలితంగా అమెజాన్‌ ఒక్క అమెరికాలోనే ఏకంగా రూ.100 కోట్లు సంపాదించిందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారని తెలుస్తుంది!

ఇదే సమయంలో వినియోగదారులు కొనుగోలు చేయాలనుకునే వస్తువు ధరను బయటి రిటైలర్లతో పోల్చిచూసి.. ఆ వివరాలు నమోదు చేసుకుని.. ఆ తర్వాత అమెజాన్‌ లో వాస్తవ ధరను మార్చి సదరు వినియోగదారుడికి విక్రయించినట్లు ఎఫ్‌టీసీ తెలిపింది. అయితే ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్‌ లు, హాలిడే షాపింగ్ సీజన్‌ లో కస్టమర్లు ధరల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు కాబట్టి.. ఆ సమయంలో ఈ అల్గారిథం ను నిలిపివేస్తున్నారని వివరించింది.

అయితే ఈ ఆరోపణలపై అమెజాన్ ప్రతినిధి టిమ్ డోయల్ స్పందించారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పిటిషన్‌ లో తెలిపిన సమాచారం సత్యదూరం అని అన్నారు. నెస్సీ చేస్తున్న ధరల పోలికలు తప్పుగా వస్తుడడంతో చాలా కాలం క్రితమే కంపెనీ ఆ అల్గారిథం ను వాడడం నిలిపివేసిందని తెలిపారు. మరి ఈ వ్యవహారంపై కోర్టులో ఏమి తేలనుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News