అంబానీ వారసుడి పెళ్లి ట్రీట్ ఆ రేంజులోనే!
ముఖేష్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు
ముఖేష్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు. 2024 జనవరిలో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ నిశ్చితార్థం జరిగింది. తిరిగి మార్చిలో ఈ జంట మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకల్ని నిర్వహించారు. అంతర్జాతీయ గాయని రిహాన్నా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ప్రత్యేక అతిథులుగా.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ , ఆలియా సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తల నడుమ వైభవంగా జరిగింది.
మూడు రోజుల వేడుకల కోసం 1000 కోట్లు ఖర్చు చేసింది అంబానీల కుటుంబం. ఇప్పుడు రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకను క్రూయిజ్ షిప్ విహారయాత్రగా ప్లాన్ చేసారు. యూరప్‌లో ఈ విహారయాత్ర జరుగుతోంది. ఈ ప్రీవెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలోకి రాకముందే అనంత్ అంబానీ -రాధిక మర్చంట్‌ల వివాహ ఆహ్వాన పత్రిక వైరల్‌గా మారింది. శ్రీమతి కోకిలాబెన్-శ్రీ ధీరూభాయి అంబానీ, శ్రీమతి పూర్ణిమా బెన్- శ్రీ రవీంద్ర భాయ్ దళాల్ ఆశీస్సులతో అంటూ ఈ లేఖను ముద్రించారు.
ఈ ఇన్విటేషన్ కార్డ్ వివరాల ప్రకారం.. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం జూలై 12 న జరగనుంది.. ఈ జంట విదేశాలలో వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఆహ్వానం ప్రకారం, వివాహం జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఇది మళ్లీ 3 రోజుల సుదీర్ఘ వేడుక. ఈ జూలై 12న శుభ వివాహంతో ప్రారంభమై జూలై 14న మంగళ్ ఉత్సవ్ లేదా రిసెప్షన్‌తో ముగుస్తుంది. మొదటి రోజు దుస్తుల కోడ్ సాంప్రదాయబద్ధంగా ఉంటుంది.. రెండవ రోజు అంటే దైవ ఆశీర్వాదం కోసం దుస్తుల కోడ్ సాంప్రదాయ ఫార్మల్స్ ను ఉపయోగించాలి. 14న అతిథులు ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్ దుస్తులు ధరించాలని భావిస్తున్నారు. పెళ్లి వివరాలను తెలియజేసే తొలి ఆహ్వాన లేఖ ఇది. అధికారికంగా ఆహ్వానం అందుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్‌లో వైభవంగా జరుగుతుండగా సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, ఓర్రీ, సారా అలీ ఖాన్ వంటి స్టార్లు ఇటలీలో ఉన్నారు. సెలబ్రిటీలంతా విలాసవంతమైన క్రూయిజ్‌లో ఉన్నారు. క్రూయిజ్ ఈవెంట్‌ను ముగించడానికి దక్షిణ ఫ్రాన్స్‌కు వెళుతుంది. సెలబ్రిటీల కోసం కొన్ని కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఇందులో డ్యాన్సులు, సంగీత కార్యక్రమాలను డిజైన్ చేసారు.