పవన్ నాలుగో పెళ్లాంపై అంబటి ఫైర్!
ఈ వ్యాఖ్యలపై మంత్రి అంబటి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. బుధవారం తాడేపల్లి గూడెంలో నిర్వహించిన టీడీపీ-జనసేన సంయుక్త సమావేశం జెండా సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి కౌంటర్ ఇచ్చారు. జెండా సభలో పవన్ మాట్లాడుతూ.. ''నా వ్యక్తిగత విషయాల గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. జగన్ కూడా మాట్లాడుతున్నాడు. మూడు పెళ్లిళ్లు.. నాలుగు పెళ్లిళ్లు అని చెబుతున్నాడు. మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు నిజమే. మరి నాలుగో పెళ్లాం ఎవరు? '' అని ప్రశ్నించిన పవన్.. నాలుగో పెళ్లాం జగనేని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి అంబటి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని అన్నారు. 'తాడేపల్లిగూడెం సభలో పవన్ షేరింగ్ గురించి మాట్లాడతారేమో అని అభిమానులు ఎదురు చూశారు. పవర్ స్టార్ అన్నారు కానీ.. పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదు. సీఎం జగన్ ను దూషించేందుకే జెండా సభ పెట్టినట్లుంది'' అని వ్యాఖ్యానించారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పవన్.. ఇప్పుడు తనను ప్రశ్నించవద్దంటూ ఎవరిని బెదిరిస్తున్నారని అన్నారు.
పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పవన్ నాలుగో పెళ్లాం ముమ్మాటికీ నాదెండ్ల మనోహరేనని, ఈ విషయాన్ని తమతో ఎందుకు చెప్పించుకుంటారని అన్నారు. జగన్ ను పాతాళానికి తొక్కాలంటే పవన్ ను పుట్టించిన వాళ్లు రావాలని వ్యాఖ్యానించారు. ''నీ జనసైనికులను అడుగు. పవన్ గొప్పో, జగన్ గొప్పో చెబుతారు. రాజకీయాల్లో పవన్ ఆటలో అరటి పండు'' అని అంబటి దుయ్యబట్టారు.
'చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు మొగుడు జగనేనని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లిని చంకన పెట్టుకుని వెళ్లకూడదనే లోకేష్‌ను సభకు రానివ్వలేదని సటైర్లు వేశారు. చంద్రబాబు అన్నీ తెలిసిన వాడు కావడం వల్లే లోకేష్‌ను సభకు వద్దన్నారని వ్యాఖ్యానించారు.