వైఎస్ షర్మిలపై అంబటి, రోజా ఊహించని వ్యాఖ్యలు!

ముఖ్యమంత్రి జగన్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళపై మంత్రులు అంబటి రాంబాబు.. ఆర్కే రోజా ఊహించని రీతిలో స్పందించారు.

Update: 2024-01-29 12:26 GMT

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ అధికార వైసీపీ నేతలపైనా, ప్రధానంగా.. ముఖ్యమంత్రి జగన్ పైనా, వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ హోదారో చేసిన తొలి ప్రసంగం నుంచి, రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న మీటింగ్ లతో పాటు.. పారీ సమన్వయ మీటింగ్ లలోనూ షర్మిళ... వైఎస్సార్సీపీ నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు అంబటి, ఆర్కే రోజా స్పందించారు.

అవును... మైకు పట్టుకోవడం ఆలస్యం వైసీపీ ప్రభుత్వంపైనా, మంత్రులపైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళపై మంత్రులు అంబటి రాంబాబు.. ఆర్కే రోజా ఊహించని రీతిలో స్పందించారు. ఈ సందర్భంగా... పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అంబటి రాంబాబు అంటే... చంద్రబాబు ఇప్పుడు కొత్తగా నాలుగో కృష్ణుడిని ఎంటర్ చేశారంటూ ఆర్కే రోజా కామెంట్ చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల రాష్ట్ర పర్యటనలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిళ... వైసీపీ నేతలు, నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు ఆ ప్రాజెక్టును గాలికి వదిలేశారంటూ ఇటీవల విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై ఫైరయ్యారు. సంక్రాంతి డ్యాన్సులంటూ సెటైర్లు వేశారు.

ఇందులో భాగంగా... గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు నీటిలో తేలుతున్నాయని, సంబంధిత శాఖా మంత్రి మాత్రం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారని షర్మిల సెటైర్లు వేశారు. ఇవి వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన అంబటి రాంబాబు... "పాపం... షర్మిల పిచ్చి పిల్ల. ఓవర్ యాక్షన్ చేస్తోంది" అంటూ ఊహించని రీతిలో స్పందించారు.

అనంతరం... "అంతకన్నా నేనేం చెప్పలేను.. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోంది.. అయితే, రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది.. ఆమెను ఓవర్ యాక్షన్ చేసుకోనివ్వండి" అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ సమయంలో మరోపక్క మంత్రి రోజా సైతం షర్మిళపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పక్క రాష్ట్రాల్లో ఉంటున్న వారు ఏపీకి వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఇదే సమయంలో... ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాటలకు విలువే లేదని.. షర్మిల వేషం కాంగ్రెస్ ది, స్క్రిప్ట్ చంద్రబాబుది అని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇప్పుడు ఏపీలో కొత్తగా నాలుగో కృష్ణుడిని ఎంటర్ చేశారు.. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం వారు జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు అని ఫైరయ్యారు.

ఇలా వరుసపెట్టి ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా ఇద్దరూ వైఎస్ షర్మిలపై ఊహించని రీతిలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై షర్మిళ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!


Tags:    

Similar News