టిక్ టాక్ ను అమెరికా ఎందుకు నిషేధించాలనుకుంటోంది?

ఈ నెల 19 నుంచి టిక్ టాక్ బ్యాన్ కానుందనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. చైనాలో 300 మిలియన్ యూజర్స్ ని కలిగి ఉన్న ఈ యాప్ కు అమెరికాలోనూ ఆధరణ ఎక్కువే అని చెబుతున్నారు.

Update: 2025-01-15 18:30 GMT

అమెరికాలో త్వరలో టిక్ టాక్ యాప్ ను మూసివేయాలనే ఆలోచన చేస్తున్నారనే చర్చ ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకుంది. ఫెడరల్ నిషేధం అమల్లోకి వచ్చిన అదే రోజున ఈ షార్ట్ వీడియో యాప్ ను మూసివేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... అమెరికా జనాభాలోని సుమారు 170 మిలియన్ల మంది ఇకపై దీన్నీ యాక్సెస్ చేయలేరని చెబుతున్నారు.

అవును... ఈ నెల 19 నుంచి టిక్ టాక్ బ్యాన్ కానుందనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. చైనాలో 300 మిలియన్ యూజర్స్ ని కలిగి ఉన్న ఈ యాప్ కు అమెరికాలోనూ ఆధరణ ఎక్కువే అని చెబుతున్నారు. ఇందులో భాగంగా... 17 కోట్ల వినియోగదారులు అక్కడ ఈ యాప్ ను వాడుతున్నట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే ఈ టిక్ టాక్ ను యునైటెడ్ స్టేట్స్ అంతటా నిషేధించబడవచ్చని అంటున్నారు. దీంతో... ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రోజు ముహూర్తం పెట్టినట్లు చెబుతున్నారు. ఇంత భారీ డిమాండ్ ఉన్న ఈ యాప్ ను ఎందుకు బ్యాన్ చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం... జనవరి 19 నుంచి యూఎస్ లో టిక్ టాక్ ను నిషేధించే చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించే అవకాశం ఉంది. వాస్తవానికి టిక్ టాక్ చైనీస్ యజమాని బైట్ డాన్స్ ను.. ఈ యాప్ ను విక్రయించమని.. లేదా, మూసివేయమని కోరుతూ గత ఏడాది యూఎస్ ప్రభుత్వం ఒక చట్టన్ని ఆమోదించిందని చెబుతున్నారు.

ఈ టిక్ టాక్ యాప్ ప్రస్తుతం చైనాకు చెందిన బైట్ డాన్స్ కంపెనీ యాజమాన్యంలో ఉంది. ఇది చైనా కంపెనీకి చెందినది కాబట్టి.. జాతీయ భద్రత దృష్ట్యా ఈ యాప్ ను నిషేధించాలని గతంలోనే సుప్రీంకోర్టు హెచ్చరించినట్లు చెబుతున్నారు. దీని మాతృ సంస్థ చైనా ప్రభుత్వ గూఢచార కార్యకలాపాలకు సహకరిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News