పోలీసుల దౌర్జన్యం... అమెరికాలో నల్లజాతీయుడు మృతి!

వివరాళ్లోకి వెళ్తే... ఫ్రాంక్‌ టైసన్‌ (53) అనే వ్యక్తిని హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అనుమానితుడిగా భావించిన ఒహియో స్టేట్‌ పోలీసులు ఓ బార్‌ లో పట్టుకున్నారు.

Update: 2024-04-27 05:06 GMT

అమెరికా పోలీసుల్లో మానవత్వం పాళ్లు తగ్గుతున్నాయనే చర్చ ఇటీవల కందుల జాహ్నవి మృతి కేసులో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె విషయంలో సీటెల్ పోలీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంలో భారత్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వెళ్లువెత్తాయి. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటన తరహాలో ఇది చోటుచేసుకోవడంతో ఈ ఇష్యూ వైరల్ గా మారింది.

అవును... ఇటీవల కాలంలో అమెరికా పోలీసు అధికారుల వివాదాస్పద వైఖరికి సంబంధించిన విషయాలు వరుసగా తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పోలీస్ అధికారులకు బాడీ కెమెరా ఉండటం పుణ్యమాని వారి వ్యవహారి శైలి ప్రపంచానికి తెలుస్తుందని భావించొచ్చు! ఈ క్రమంలో తాజాగా అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటన తరహాలో మరోకటి చోటు చేసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... ఫ్రాంక్‌ టైసన్‌ (53) అనే వ్యక్తిని హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అనుమానితుడిగా భావించిన ఒహియో స్టేట్‌ పోలీసులు ఓ బార్‌ లో పట్టుకున్నారు. ఈ సమయంలో... బార్‌ లో ఉన్న ఫ్రాంక్‌ టైసన్‌ ను బలవంతంగా లాక్కేళ్లుతూ.. మెడపై మోకాలు పెట్టి ఇద్దరు పోలీసులు బేడీలు వేసి ఊపరాడకుండా చేశారు. ఈ సమయంలో ... "ఊపిరి ఆడటం లేదు.. వదిలేయండీ.." అని అతడు ఎంత వేడుకున్నా ఆ ఇద్దరు పోలీసులు అస్సలు వినకుండా అతనిపై మోకాలు పెట్టి బేడీలు వేశారు.

ఫలితంగా... నిమిషాల వ్యవధిలోనే అతడు స్పృహ కోల్పోయాడు. దీంతో... వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా... అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు కన్ ఫాం చేశారు. ఈ ఘటన ఏప్రిల్‌ 18న చోటు చేసుకుంది. ఈ ఘోరానికి సంబంధించి బాడీ కెమెరా వీడియో ఫుటేజ్‌ ను ఒహియో స్టేట్‌ పోలీస్ డిపార్ట్‌ మెంట్‌ విడుదల చేసింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

కాగా... 2020లో మినియాపొలిస్‌ పోలీసుల చేతిలో జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడు ఇలాగే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో... నాడు అమెరికా పోలీసుల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో... జార్జ్ ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన పోలీసు అధికారిని కోర్టు కఠిన శిక్ష విధించింది.

Tags:    

Similar News