ఏపీకి అమిత్ షా...బీజేపీ షో స్టార్ట్...!

అదేంటి అంటే అసెంబ్లీ ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరుగుతాయో అక్కడికి ఎక్కువగా మోడీ అమిత్ షాలు పర్యటిస్తారు. మోడీ కంటే ముందు అమిత్ షా ఆ స్టేట్ కి చేరుకుని ఎన్నికల సన్నద్ధత కోసం పార్టీని రెడీ చేస్తారు.

Update: 2024-01-06 23:30 GMT

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి వస్తున్నారు. ఇది గతంలో లాంటి పర్యటన కాదు. రాజకీయాల మీద అవగాహన ఉన్న చాలా మందికి ఒక విషయం స్పష్టంగా తెలుతుంది. అదేంటి అంటే అసెంబ్లీ ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరుగుతాయో అక్కడికి ఎక్కువగా మోడీ అమిత్ షాలు పర్యటిస్తారు. మోడీ కంటే ముందు అమిత్ షా ఆ స్టేట్ కి చేరుకుని ఎన్నికల సన్నద్ధత కోసం పార్టీని రెడీ చేస్తారు.

ఇది గడచిన పదేళ్ళుగా దేశమంతా బీజేపీ చేసే పొలిటికల్ యాక్షన్ ప్లాన్. ఇపుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. నిజానికి బీజేపీకి చూస్తే ఏపీలో బలం పెద్దగా లేదు నోటా కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చాయి. అయితే బీజేపీకి ఏపీలో ఎదురులేని పరిస్థితి ఉందని ఒక నిర్దిష్టమైన రాజకీయ విశ్లేషణ.

ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ బీజేపీ తో ప్రయ్తక్షంగా లేదా పరోక్షంగా ఉంటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ టీడీపీ కీలక బిల్లులలో మద్దతు ఇస్తూ వచ్చాయి. ఈ రోజుకు కూడా విభజన హామీల విషయంలో సైతం ప్రధాన పార్టీలు గట్టిగా నిలదీయడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి.

ఇక ఎన్నికలు వస్తే చాలు బీజేపీతో పొత్తుకు ఏపీలోని పార్టీలు ఆరాటం చూపిస్తూంటాయి. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఒక అంచనాతోనే బీజేపీతో వైరాన్ని ప్రధాన పార్టీలు కోరుకోవడం లేదు. అదే బీజేపీకి ఏపీలో అతి పెద్ద అడ్వాంటేజ్ గా మారుతోంది.

ఏపీలో చూస్తే బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన కూటమి ఎదురుచూస్తున్నాయని ప్రచారంలో ఉన్న మాట. బీజేపీ ఇప్పటిదాకా పొత్తుల విషయంలో ఏ సంగతీ తేల్చలేదు. తాజాగా విజయవాడలో జరిగిన ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో సైతం పొత్తుల మీద అభిప్రయా సేకరణ జరిగింది. అదే టైం లో మొత్తం 175 సీట్లలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద కూడా బీజేపీ కోర్ కమిటీ మెంబర్స్ నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం తేల్చుతుందని ఆ పార్టీ స్టేట్ లీడర్స్ చెబుతున్నారు. ఇక దీని మీద సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. అయితే రానున్న వారంలో బీజేపీ పార్లమెంట్ బోర్డు కీలక సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఈ బోర్డు మీటింగులో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. ఎన్నికల్లో పొత్తులు ఎత్తులు అన్నీ కూడా బోర్డు మీటింగులోనే డిసైడ్ చేస్తారు.

దాంతో బోర్డు మీటింగులో ఏమి తేల్చుతారు అన్నది ఉత్కంఠగా మారింది. ఇక ఏపీలో కూటమి పెద్దలు కూడా బీజేపీ బోర్డు మీటింగ్ మీదనే చూపు సారించారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే బోర్డు మీటింగ్ తరువాత ఏపీకి అమిత్ షా వస్తారని అంటున్నారు. అంటే బీజేపీ ఏపీ స్ట్రాటజీ ఖరారు చేసిన తరువాత దాన్ని ఏపీలో అమలుచేయడానికి అమిత్ షా ఏపీకి వస్తారు అని అంటున్నారు.

అమిత్ షా ఏ సందేశం మోసుకుని వస్తారు అన్నది కూడా ఇపుడు బీజేపీ నేతలతో పాటు ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలలో ఆసక్తి నెలకొంది. ఇంకో వైపు చూస్తే ఏపీలో బీజేపీ పొలిటికల్ షో మరి కొద్ది రోజులలో స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. అమిత్ షా డైరెక్షన్ లో ఏపీ బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారు అని అంటున్నారు

ఒక విధంగా బీజేపీ పొత్తులు ఎత్తులు అన్నవి ఏపీలో రాజకీయాన్ని మలుపు తిప్పుతాయని అని అంతా భావిస్తున్నారు. బీజేపీ టీడీపీ కూటమితో పొత్తు పెట్టుకుంటే ఒకలా లేకపోతే మరోలా ఏపీ పాలిటిక్స్ మారనుంది. ఇక అమిత్ షా ఏపీకి వచ్చే సందర్భంగా అధికార వైసీపీ మీద ఆ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం మీద ఏ రకమైన కామెంట్స్ చేస్తారు అన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తానికి అమిత్ షా ఏపీకి వస్తున్నారు అంటే కేంద్రంలోని బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టేస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News