ఆల్ హ్యాపీస్ .. పవన్ తో అనిత భేటీ
అవసరం అయితే నేనే ఆ శాఖ తీసుకుంటాను అన్న పవన్ కళ్యాణ్ అనితమ్మతో నవ్వుతూ ముచ్చటించిన పిక్స్ ఇపుడు బయటకు వచ్చి ఈ ఇష్యూ క్లోజ్ అన్నట్లుగా సంకేతాలు పంపించాయి.
ఏపీలో లా అండ్ ఆర్డర్ ఏదీ అని మూడు రోజుల క్రితం నిప్పులు చెరిగిన ఉప ముఖ్యమంత్రి హోం మంత్రి నేరుగా హోం మంత్రి వంగలపూడి అనితను టార్గెట్ చేశారు. అయితే లేటెస్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇద్దరూ కలిశారు.
ఈ సందర్భంగా ఒకరిని ఒకరు నవ్వుతూ పలకరించుకుంటూ ఆల్ ఈజ్ వెల్ అనిపించారు. ఏపీలో హోం మంత్రిత్వ శాఖ పనితీరు బాగాలేదు, అవసరం అయితే నేనే ఆ శాఖ తీసుకుంటాను అన్న పవన్ కళ్యాణ్ అనితమ్మతో నవ్వుతూ ముచ్చటించిన పిక్స్ ఇపుడు బయటకు వచ్చి ఈ ఇష్యూ క్లోజ్ అన్నట్లుగా సంకేతాలు పంపించాయి.
ఇదంతా టీ కప్పులో తుఫాను మాదిరిగా చల్లబడింది అని అంటున్నారు. ఈ మేరకు పిక్స్ అయితే రిలీజ్ అయ్యాయి. పవన్ తో నవ్వుతూ అనిత కనిపించారు. శాఖాపరమైన అంశాలను ఆమె చర్చించారు. అనంతరం అనిత సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో జరిగిన మర్యాదపూర్వక భేటీలో అనేక అంశాలను చర్చించామని అనిత పేర్కొన్నారు. హోంశాఖ పరిధిలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అనేక విషయాలను తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రిని వివరించామని ఆమె చెప్పారు.
ఇక చిన్నారులు, మహిళల విషయంలో జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు అని అనిత వెల్లడించారు. అంతే కాదు మహిళలకు అన్యాయం చేసిన వారి విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారని ఆమె చెప్పారు.
జనం కోసం వారి సంక్షేమం కోసం అనుక్షణం పాటు పడే ప్రజా ప్రభుత్వం తమది అని అనిత చెప్పారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం హోం శాఖ పనితీరు పట్ల పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా జరిగిన సమావేశంలో మాత్రం అనితకు సూచనలు సలహాలు ఇచ్చి పవన్ ఆ మొత్తం వ్యవహారానికి ఎండ్ కార్డు వేశారు అని అంటున్నారు.
అంటే ప్రస్తుతానికి హోం శాఖ మీద పవన్ కళ్యాణ్ అయితే ఏ రకమైన విమర్శలు చేయరనే అనుకోవాలి. తాను చెప్పిన మేరకు హోం శాఖ పనితీరు మెరుగుపరచుకోవాలని బహుశా ఆయన ఆశిస్తూ ఉండవచ్చు. అలా జరగని పక్షంలో ఆయన మళ్లీ గళం విప్పుతారేమో. ఏది ఏమైనా హోం మంత్రి ఉప ముఖ్యమంత్రి ఇష్యూ మాత్రం ఏపీలో కొంత దాకా రాజకీయ కాక పుట్టించింది అని చెప్పాలి.అయితే ఇపుడు టోటల్ ఎపిసోడ్ నవ్వులతోనే శుభంగా ముగిసింది అని అంటున్నారు.