బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేశారా?... ఇదొక్కసారి చదవండి!
ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే.;

ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, ఇన్ ఫ్లుయెన్సర్ లపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇదే సమయంలో.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో.. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది.
అవును... ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోన్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... బెట్టింగ్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోకుండా నిషేధించేందుకు ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేయిస్తోంది. దీంతో... బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటే.. ఫోన్ బ్లాక్ అయ్యే పరిస్థితిలో కౌంటర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది!
ఇందులో భాగంగా.. సైబర్ విభాగం ద్వారా లభించిన బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న మొబైల్ సమాచారం ఆధారంగా సదరు ఫోన్ ను బ్లాక్ చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ సాఫ్ట్ వేర్ పూర్తవ్వగానే.. అది హోంశాఖకు అందిస్తుందని.. దీని సహాయంలో డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగుతుందని అంటున్నారు.
మరోపక్క బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు రేవంత్ వెల్లడించారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఆన్ లైన్ గేమ్స్ ను ప్రోత్సహించినా, ప్రకటనలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.