ఏపీ లిక్కర్ లాటరీలో అత్యంత దురదృష్టవంతులు వీరు

అదృష్టం ఎంత ఆనందాన్ని తీసుకొస్తుందో.. దురదృష్టం అంతకు మించిన వేదనను తీసుకొస్తుంది.

Update: 2024-10-15 08:42 GMT

అదృష్టం ఎంత ఆనందాన్ని తీసుకొస్తుందో.. దురదృష్టం అంతకు మించిన వేదనను తీసుకొస్తుంది. ఏపీ మద్యం షాపుల కేటాయింపు వేళ.. అదృష్టం - దురదృష్టాలే కీ రోల్ ప్లే చేశాయి. దరఖాస్తులు పెట్టుకున్నోళ్లలో లాటరీలో వచ్చిన వారికి షాపులు కేటాయించిన ఉదంతంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు అయ్యో అనిపించేలా మారాయి. మద్యం షాపుల లాటరీకి సంబంధించి ఎక్కువ అప్లికేషన్లు దాఖలు చేస్తే.. ఎక్కువ మద్యం షాపులు తగులుతాయన్న ఒక లెక్క తరచూ వినిపిస్తూ ఉంటుంది.

అయితే.. లక్ అన్నది లేకుండా ఎన్ని లెక్కలు వేసుకున్న వర్కువుట్ కావన్న విషయం తాజా మరోసారి నిరూపితమైంది. ఏపీలో జరిగిన మద్యం షాపుల అలాట్ మెంట్ వేళ కనిపించిన సీన్లు ఆసక్తికరంగా మారాయి. విజయవాడకు చెందిన ఒక బార్ యజమాని తాను.. తన స్నేహితుల టీంతో కలిసి భారీగా అప్లికేషన్లు దాఖలు చేశారు. అతగాడు అప్లై చేసిన దరఖాస్తులు ఎన్నో తెలుసా? అక్షరాల 480. కానీ.. అతనికి వచ్చిన మద్యం షాపులు ఎన్నో తెలుసా? కేవలం పదకొండు మాత్రమే. ఎందుకంటే.. లక్ కలిసి రాకపోవటమే. విజయవాడకుచెందిన మరో మద్యం వ్యాపారి వేదన అంతా ఇంతా కాదు. ఆయన తన టీంతో కలిసి 380 అప్లికేషన్లు దాఖలు చేస్తే.. కేవలం 5 షాపులు మాత్రమే లాటరీలో వచ్చాయి.

అమరావతికి చెందిన మరో వ్యక్తి.. అతని టీం కలిసి 172 దరఖాస్తులు వేయగా.. రెండు షాపులు మాత్రమే అలాట్ అయ్యాయి. అతగాడి వేదన అంతా ఇంతాకాదు. గుంటూరు వెస్టు నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య నేత స్నేహితుడు దాఖలు చేసింది 11 అప్లికేషన్లు మాత్రమే. కానీ.. అతగాడికి తగిలిన షాపులు రెండు. ఇలా మద్యం షాపుల కోసం పెద్ద ఎత్తున అప్లికేషన్లు దాఖలు చేయటం.. వారికి తగలకపోవటంతో వారిలో వారు.. వేదనతో బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్లం అయ్యామనుకోవటం వినిపించింది.

Tags:    

Similar News