ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 'బ్రేక్'.. ఏం జరిగిందంటే!
ఇక, మరో ప్రధాన రాజకీయ పక్షం అంటూ ఏదీ కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు.;
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏపీలో సంచలనం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రత్యర్థులు కానీ.. ఇండిపెండెంట్లు కానీ లేకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే పరిస్థితి ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. అంటే.. ఈ నెల 20న జరగాల్సిన పోలింగ్ జరగకపో వచ్చు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఒకవైపు, వైసీపీ మరో వైపు ఉన్నాయి. ఇక, మరో ప్రధాన రాజకీయ పక్షం అంటూ ఏదీ కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు.
ఇది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూటమికి కలిసి వచ్చిన పరిణామంగా మారింది. వాస్తవానికి వైసీపీకి బరిలో నిలుస్తుందని.. ఒక అభ్యర్థినైనా నిలబెడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. అయితే.. 11 మంది ఎమ్మెల్యేలతో పోరాడి.. పుట్టి ముంచుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో వైసీపీ ఈ పోరుకు దూరంగా ఉంది. దీంతో టీడీపీ-జనసేన-బీజేపీ మినహా మరో పార్టీ ఎక్కడా పోటీలో లేకపోవడం గమనార్హం. ఇది.. ఆయా అభ్యర్థులకు కలిసి వచ్చింది.
కాగా.. నామినేషన్ల ఉపసంహరణకు.. రేపటి వరకు గడువు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు ఎన్నికల అధికారులు వేచి చూసి.. తమ నిర్ణయం ప్రకటించనున్నారు. దీంతో ఎలాంటి ఎన్నికలు లేకుండానే రాకుండానే.. ఈ దఫా ఐదుగురు అభ్యర్థులు మండలిలోకి అడుగు పెట్టనున్నారు. ఇది ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత.. జరుగుతున్న తొలి సంచలనమే నని చెప్పాలి.
గతంలో టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు.. పోటీ పెట్టారు. అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా.. పోటీ జరిగింది. అయితే.. ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగానే ఎన్నికలు జరిగాయి. కానీ, ఇప్పుడు వైసీపీకి అంత సంఖ్యా బలం లేనందున ఏకపక్షం కానున్నాయని తెలుస్తోంది.