ఏపీలో పరిస్థితులపై ఎన్.ఎస్.ఎస్.ఓ. సర్వే... తెరపైకి సంచలన విషయాలు!

ఈ మేరకు జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎ.ఎస్.ఎస్.వో) తాజాగా తన సర్వే నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది.

Update: 2024-11-06 03:42 GMT

చదువులు, ఆరోగ్య సమస్యలు, అక్షరాస్యత, స్మార్ట్ ఫోన్లు, అప్పులు, ఇంటర్నెట్ వినియోగం... ఇలా మొదలైన అంశాలపై ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిపై ఓ ఆసక్తికర సర్వే తెరపైకి వచ్చింది. ఈ మేరకు జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎ.ఎస్.ఎస్.వో) తాజాగా తన సర్వే నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది.

అవును... ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పరిస్థితులపై ఆసక్తికర నివేదికను జాతీయ శాంపుల్స్ సర్వే సంస్థ (ఎ.ఎస్.ఎస్.వో) వెల్లడించింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో 8,758 గ్రామాలు.. 6,540 పట్టణాల్లోని 3.02 లక్షల కుటుంబాలపై ఈ సర్వే జూలై 2022 - జూన్ 2023 మధ్య నిర్వహించినట్లు తెలిపింది.

వైద్య ఖర్చులు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ఏడాదికి పట్టణాల్లో రూ.5,288, గ్రామాల్లో రూ.4,316 వైద్యానికి ఖర్చు పెడుతోంది. ఈ లెక్క తెలంగాణలో గ్రామాల్లో రూ.5,088 గా ఉండగా.. పట్టణాల్లో రూ.5,648గా ఉంది. ఇక వ్యక్తిగత వైద్య ఖర్చుల విషయానికొస్తే... ప్రతీ వ్యక్తి పట్టణాల్లో రూ.1,705, గ్రామాల్లో రూ.1,285 వంతున ఏడాదికి ఖర్చు చేస్తున్నాడు.

చదవడం, రాయడం..!:

రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడినవారిలో నిత్యజీవితంలో తేలికైన వాక్యాలు రాడం, చదవడం, అర్ధం చేసుకోవడంతోపాటు చిన్న చిన్న లెక్కలు చేయడం తెలిసినవారు 71.4 శాతం మాత్రమే ఉన్నారు. ఈ విషయాలు తెలియని వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 25.2% పురుషులు, 41.1శాతం మహిళలు ఉన్నారు.

ఇదే క్రమంలో... 15 నుంచి 24 ఏళ్ల లోపు వయసుండి సాధారణ విద్య, ఉపాధితో పాటు ఏ ఇతర రంగంలోనూ శిక్షణ పొందనివారు రాష్ట్రంలో 20.1 మంది ఉన్నారు.

ఇక 25 ఏళ్లు దాటినవారిలో సెకండరీ విద్యవరకూ వచ్చిన వారి సంఖ్య ఏపీలో 33.7 శాతం ఉంది. వీరి సంఖ్య పట్టణాల్లో 50.7 శాతంగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 26.4 శాతంగా ఉంది.

కెరీర్ విషయంలో మెజారిటీ ఎస్ & టీ!:

కెరీర్ విషయానికొస్తే... 21 నుంచి 35 ఏళ్లు ఉన్న ఏపీ యువతలో గరిష్టంగా 65.5 శాతం మంది సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు చదువుతుండగా.. వీరి సంఖ్య పట్టణాల్లో పురుషులు 70.1 శాతం, మహిళలు 63.8శాతం మంది ఉన్నారు. ఇక గ్రామాల విషయానికొస్తే వీరిలో పురుషులు 63.9శాతం మంది, మహిళలు 58.4 శాతం మంది చొప్పున ఉన్నారు.

Tags:    

Similar News