కూటమి సర్కారుకు.. 'కాకినాడ' ప్లస్సా.. మైనస్సా... !
మొత్తంగా కాకినాడ పోర్టులో నిఘాను పెంచడంతోపాటు.. రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశం.. కాకినాడ పోర్టు. ఇక్కడ నుంచి రేషన్ బియ్యం స్మ గ్లింగ్ జోరుగా సాగుతోందని.. పేదలకు ఇచ్చే బియ్యాన్ని పెద్దలు కాజేస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఆయనే స్వయంగా పోర్టును సందర్శించి... పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాకినాడ పోర్టు విషయంపై సీరియస్‌గా నే ఉందన్న సంకేతాలు ఇచ్చారు. నేరుగా ఈ విషయంపై సీఎం జోక్యం చేసుకున్నారు. ఐపీఎస్ అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తంగా కాకినాడ పోర్టులో నిఘాను పెంచడంతోపాటు.. రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ పరిణామాలు.. కూటమి పార్టీలకు మేలు చేస్తాయా? కీడు చేస్తాయా? అనేది రాజకీయంగా చర్చకువ స్తోంది. సాధారణంగా రేషన్ బియ్యాన్ని ఇలా స్మగ్లింగ్ చేయడం తప్పే. ఎవరు చేసినా తప్పుబట్టాల్సిందే. కానీ, ఒకే కోణంలో ఈ రేషన్ బియ్యంపై విచారణ.. పరిశీలనలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వ అనుకూల మీడియాల్లో వస్తున్న వార్తలను బట్టి.. వైసీపీ నాయకులను ఈ విషయంలో పూర్తిగా కట్టడి చేసేందుకు సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది సాధ్యమా? కాదా? అన్న విషయా లను పక్కన పెడితే.. ఎంతో కొంత వరకైనా కట్టడి చేయొచ్చు. కానీ, ఇతర నాయకుల మాటేంటి? అనేది ప్రశ్న. పవనే చెప్పినట్టు రేషన్ బియ్యం ఆగడాల వెనుక.. చాలా పెద్ద నెట్ వర్క్ ఉంది. దీనిలో అన్ని పార్టీల నేతల ప్రమేయం కూడా ఉంది.
ఎక్కడెక్కడ నాయకులు కొట్టుకున్నా.. ఇన్నేళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా... రేషన్ బియ్యంపై కామెంట్లు చేయలేదు. దీనిని బట్టి అసలు సిండికేట్.. అంతా.. పార్టీలకు అతీతంగా నడిచిపోతోంది. కాబట్టి రాజకీ యంగా ఒక పార్టీని మాత్రమే దెబ్బతీయడం అనేది సాధ్యం కాదు. ఇక, పోర్టు కార్యకలాపాలు నిలిచిపోతే.. ప్రత్యక్షంగా 12 వేల మంది.. పరోక్షంగా 50 వేల మంది కుటుంబాలపై ప్రభావం చూపనుంది. మొత్తంగా ఎటు చూసినా.. ప్లస్సుల కంటే .. మైనస్‌గానే ఉంది. పోనీ.. ప్రజలకు ఈ రేషన్ బియ్యం తినాలని కూడా లేదు. సో.. రేషన్ బియ్యాన్ని తీసుకుంటామని ప్రజల్లో కూడా అభిప్రాయం లేదు. దీనిని బట్టి.. `కాకినాడ` వ్యవహారం పెద్దగా ఫలించడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.