సచివాలయ ఉద్యోగులు విషయంలో కూటమి డెసిషన్!

వారికి ముప్పయి వేల రూపాయలు శాలరీ ఇచ్చారు. కానీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారికి పూర్తి స్థాయి పే స్కేల్ ఇవ్వలేదని జగన్ మీద ఆగ్రహం ఉండేది.

Update: 2024-12-03 04:06 GMT

వైసీపీ హయాంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పెద్ద ఎత్తున తీసుకున్నారు. వీరి సంఖ్య ఒక లక్షా 27 వేల పై దాటి ఉంది. వీరందరినీ మొదటి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పి నెలకు 15 వేల రూపాయలు వేతనంగా ఇచ్చేవారు. ఆ తరువాత వీరికి డిపార్ట్మెంట్ టెస్టులు అని పెట్టి అందులో పాస్ అయిన వారిని పెర్మనెంట్ చేశారు.

వారికి ముప్పయి వేల రూపాయలు శాలరీ ఇచ్చారు. కానీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారికి పూర్తి స్థాయి పే స్కేల్ ఇవ్వలేదని జగన్ మీద ఆగ్రహం ఉండేది. ఆ విధంగా వారు వైసీపీ సృష్టించిన సచివాలయాల ద్వారా జాబ్స్ పొందినా కూడా అత్యధికులు వైసీపీకి వ్యతిరేకంగానే పనిచేశారు అన్న ప్రచారం ఉంది.

ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ డిమాండ్లను నెరవేరుస్తుందని మిగిలిన ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగానే తమకు కూడా మంచి పే స్కేల్ ప్రకటించి జీతాలు చెల్లించడమే కాకుండా ప్రమోషన్ చానల్ ని కూడా ఓపెన్ చేసి తమ అర్హతలకు తగిన విధంగా అవకాశాలు ఇస్తుందని భావించారు.

వైసీపీ దిగిపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. గత ఆరు నెలలుగా సచివాలయ ఉద్యోగుల విషయంలో స్టడీ చేస్తోంది. మరో వైపు రెండున్నర లక్షల మంది వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఇటీవల తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పేసింది. అసెంబ్లీ సమావేశాలలో మంత్రి బాల వీరాంజనేయస్వామి వారంతా ప్రభుత్వ రికార్డులలో లేరని వారి సేవలు కూడా 2023 ఆగస్టు తరువాత రెన్యూవల్ చేయలేదని చెప్పరు.

దాంతో వారి విషయంలో ప్రభుత్వం ఇక చేయగలిగింది లేదని అంటున్నారు. ఇపుడు ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయం మీద ఫోకస్ పెట్టింది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయం సేవలు చూస్తున్న అధికారులతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామ వార్డు సచివాయల వ్యవస్థను సమర్ధంగా ఉపయోగించుకోవాలని అధికారులని ఆదేశించారు. ఒకరికి పని ఎక్కువగా ఉందని అదే సమయంలో మరి కొందరికి పని తక్కువగా ఉందని సీఎం చెబుతూ ఈ వ్యత్యాసం సరికాదని అన్నారు. ప్రభుత్వ అవసరాలకు తగినట్లుగా అందరి సేవలనూ ఉపయోగించుకోవాలని ఆయన ఆదేశించారు.

అంతే కాదు ఉద్యోగులను అవసరమైన చోట సర్దుబాటు చేయాలని బాబు చెప్పడం గమనార్హం. అందుకు అవసరం అయితే వారికి శిక్షణ కూడా ఇవ్వాలని సూచించారు. మొత్తం ఉద్యోగులలో అత్యధిక శాతం యువ ఉన్నారని అందువల్ల వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న దాని మీద ప్రభుత్వం సీరియస్ గానే చర్చిస్తోంది.

ఇక చూస్తే గ్రామ వార్డు సచివాలయం ప్రతీ రెండు వేల మంది కోసం గతంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలా ప్రతీ సచివాలయంలో పది మంది పనిచేస్తున్నారు. వీరందరికీ జిల్లా స్థాయిలో ఉన్న స్ట్రక్చర్ కి అనుగుణంగా నియమించారు.

అంటే అగ్రికల్చర్ కి ఒకరు ఇంజనెరింగ్ వర్క్స్ కి ఒకరు, వెల్ఫేర్ కి ఒకరు, ఎడ్యుకేషన్ కి ఒకరు, హెల్త్ కి ఒకరు, విమెన్ ప్రొటెషన్ వింగ్ అని లేడీని ఒకరిని సెక్రటరీగా నియమించారు. ఈ విధంగా చూస్తే చాలా విభాగాలకి పని లేకుండా పోయింది అని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కేవలం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ కే ఎక్కువ భారం పడుతోదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలనే కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అంటున్నారు. చాలా ప్రభుత్వ ఆఫీసులలో వర్క్ లోడ్ ఉంది కానీ స్టాఫ్ తక్కువగా ఉన్నారు. అలాంటి చోట సచివాలయ ఉద్యోగులను నియమించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయా జాబ్స్ కి అవసరమైన శిక్షణను వారికి ఇచ్చి తీసుకుంటారని అంటున్నారు.

అంతే కాకుండా ప్రతీ రెండు వేల మందికి ఒక సచివాలయం కాకుండా దానికి బాగా తగ్గించడం ద్వారా ఒక పద్ధతిలో నిర్వహించాలని చూస్తున్నారని అంటున్నారు. అదే విధంగా సచివాలయంలో అవసరమైనంత మేరకే ఉద్యోగులను ఉంచాలని మిగిలిన వారిని వివిధ శాఖలకు బదిలీ చేయాలని చూస్తున్నారు

ఈ మొత్తం పరిణామం వల్ల సచివాలయ ఉద్యోగుల సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందడమే కాకుండా వారికి చెల్లిస్తున్న వేతనానికి కూడా తగిన న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఒక పోతే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు పే స్కేల్ ని వీరు కోరుతున్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్ధిక ఇబ్బందుల వల్ల అది సాధ్యం పడకపోవచ్చు అంటున్నారు. రానున్న కాలంలో మాత్రం ఈ ఉద్యోగులకు మంచి ఫ్యూచర్ ఉంటుందనే చెబుతున్నారు.

Tags:    

Similar News