అమలాపురం సీటు...బాబు పవన్ టార్గెట్!

ఒకే ఒక సీటు ఎందుకంతగా ఫోకస్ అంటే అది ప్రజెంట్ వైసీపీలో మినిస్టర్ గా ఉన్న పినిపె విశ్వరూప్ సీటు

Update: 2023-08-19 23:30 GMT

ఒకే ఒక సీటు ఎందుకంతగా ఫోకస్ అంటే అది ప్రజెంట్ వైసీపీలో మినిస్టర్ గా ఉన్న పినిపె విశ్వరూప్ సీటు. ఆయన 2019 ఎన్నికల్లో గెలిచి అయిదేళ్ళ మంత్రిగా జగన్ క్యాబినెట్ లో ఉన్నారు. ఈ సీటు మీద ఇపుడు తెలుగుదేశం జనసేన రెండు పార్టీల కన్ను పడింది. ఎందుకంటే ఇక్కడ వైసీపీకి కొంత వ్యతిరేకత కనిపిస్తోందని అంటున్నారు. మంత్రి పినిపె విశ్వరూప్ పనితీరు మీద నెగిటివిటీ ఉందని అంటున్నారు.

ఇక జగన్ వేవ్ లో అంటే 2019లో విశ్వరూప్ గెలిచారు. అప్పట్లో ఆయనకు 73 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అదే టైం లో టీడీపీకి 46 వేల ఓట్లు వస్తే జనసేనకు 45 వేల ఓట్లు వచ్చాయి. అంటే విపక్షాలు రెండూ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. ఇక పొత్తు కుదిరితే మాత్రం వైసీపీ ఈ సీటు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు.

అయితే ఈ సీటు కోసం రెండు పార్టీలలో తీవ్రమైన పోటీ ఉంది. తమకే ఈ సీటు దక్కాలన్న ఆశ కూడా ఉంది. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ అమలాపురం లో పర్యటించారు. అపుడు ఆయనకు భారీ ఎత్తున జన సందోహం వచ్చారు. దాంతో అమలాపురంలో జనసేన బేస్ స్ట్రాంగ్ గా ఉందని ఆ పార్టీ అంచనా కడుతోంది. పొత్తులు ఉన్నా లేకపోయినా తాము అమలాపురం నుంచే పోటీ చేసి తీరాలని డిసైడ్ అయినట్లుగా కూడా ప్రచారంలో ఉన్న మాట.

ఇక చంద్రబాబు కోనసీమ జిల్లాల టూర్ లో భాగంగా అమలాపురంలో మకాం వేసి మరీ మాటా మంతీ జనాలతో మేధావులతో నెరిపారు. బాబుకు కూడా జనాలు బాగానే వచ్చారు. ఇక అమలాపురంలో టీడీపీకి మొదటి నుంచి కొంత పట్టు ఉంది. దాంతో ఈసారి విజయం సాధించడం ఖాయమని తమ్ముళ్ళు అంటున్నారు. ఈ సీటును తాము వదులుకోమని చెబుతున్నారు. దానికి సంకేతంగా అమలాపురం పర్యటనను చంద్రబాబు కూడా చేపట్టారు.

మరి అమలాపురం నుంచి ఏ పార్టీ పోటీ చేస్తుంది, పొత్తులు ఉంటే ఏ పార్టీకి విడిచిపెడుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక మంత్రి పినిపె విశ్వరూప్ ఇక్కడ నుంచి పోటీ చేయకపోవచ్చునని ఆయన కుమారుడికి ఈసారి టికెట్ ఇస్తారని అంటున్నారు. దాంతో కొత్త ముఖం, యూత్ ని టాగెట్ చేసి వైసీపీ టికెట్ ఇస్తోంది అన్న మాట.

మరి పొత్తులు ఉంటే వైసీపీకి ఈ సీటు సవాల్ గా మారుతుంది అని అంటున్నారు. అయితే ఆ పొత్తులు ఫలించాలి అని అంటున్నారు. రెండు పార్టీలకు ఈ సీటు హాట్ ఫేవరేట్ అయిన వేళ ఏ ఒక్కరూ సర్దుకోని నేపధ్యం ఉంటే కనుక జనసేనకు టికెట్ ఇస్తే టీడీపీ నుంచి సహకారం ఎంతవరకూ అందుతుంది అన్నది చర్చగా ఉంది. అలగే టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన నుంచి ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. పొత్తులు ఉన్నా మనసులు కలవకపోతే మాత్రం అమలాపురంలో మరోసారి వైసీపీ జెండా ఎగరేయడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు