అఘోరీ చనిపోయాక మృతదేహాం సగాన్ని ఏమి చేస్తారో తెలుసా?

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ఈ నెల 13న మహాకుంభ మేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Update: 2025-01-19 19:30 GMT

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ఈ నెల 13న మహాకుంభ మేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగరాజ్ కి తరలివస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకూ జరిగే ఈ మహాకుంభ మేళాలో సుమారు 40 కోట్ల మంది వరకూ భక్తులు పాల్గొంటారని అంటున్నారు.

ఈ స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు అదే స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశాయని చెబుతున్నారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభ మేళా సమయంలో.. తివేణీ సంగమంలో స్నానమాచరించడం వల్ల పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇక ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అఘోరీలు కనిపిస్తున్నారు.

ఈ మహాకుంభ మేళాలో ప్రధానంగా అఘోరీలు, నాగ సాధువులు, సన్యాసులు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సందర్భంగా వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా వీరి ఆచార వ్యవహారాల గురించి తెలుసుకునే క్రమంలో ఆన్ లైన్ వేదికగా ఆసక్తికర చర్చ మొదలైంది.

ఈ సందర్భంగా... అసలు ఎవరు ఈ అఘోరీలు.. ఓ సాధారణ వ్యక్తి అఘోరీ అవ్వాలంటే ఏమి చేయాలి.. వీరు చనిపోయిన తర్వాత వీరి మృతదేహాలను ఏమి చేస్తారు మొదలైన విషయాలపై చర్చ నడుస్తుంది. వాటికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

అఘోరీగా మారాలంటే ఏమి చేయాలి?:

ఒక సామాన్యమన వ్యక్తి అసాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తూ జీవించే అఘోరీగా మారాలంటే జీవితంలో సరళతను స్వీకరించాలని అంటారు. ప్రధానంగా ఆశను, ద్వేషాన్ని త్యజించాలి. సహజంగా ఈ సమాజంలో ఉండే సామాజిక నిబంధనలను దాదాపు పూర్తిస్థాయిలో అన్నట్లుగా వాటిని ఉల్లంఘించాలి.

అంతకంటే ముఖ్యంగా... సాధారణంగా ప్రజలు అపవిత్రమైనవి, నేషేధించబడినవిగా భావించే ప్రతీదానిలో దైవాన్ని చూడాలని అంటారు. ఇవి అఘోరీగా మారడానికి గల బేసిక్ క్వాలిఫికేషన్స్ అని చెబుతుంటారు. వీరంతా శైవ సంప్రదాయాలతో లోతుగా అనుసంధానించబడి ఉంటారని అంటారు.

అఘోరీ మరణం తర్వాత శరీరాన్ని ఏమి చేస్తారు?

సాధారణంగా హిందూమతంలోని వ్యక్తి మరణిస్తే వారిని దహనం చేస్తారు! అయితే అఘోరీ సాధువు మృతి చెందితే జరిగే అంతిమ కార్యక్రమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇందులో భాగంగా... మరణించిన అనంతరం అఘోరీ శరీరాన్ని తలకిందులుగా (కాళ్లు పైకి, తల కిందకి) ఉంచుతారు. సుమారు 40 రోజులు ఈ స్థితిలోనే ఉంచుతారు.

ఆ తర్వాత ఆ మృతదేహంలో సగాన్ని పవిత్ర గంగానదిలో ముంచుతారు. ఈ క్రమంలో తల భాగాన్ని మాత్రం ఆధ్యాత్మిక అభ్యాసాల కోసమని భద్రపరుస్తారట.

Tags:    

Similar News