విమానంలో నగ్నంగా పరుగులు... అసలేం జరిగిందంటే...?

ఇంత కామన్ సెన్స్ లేనివారు ఫ్లైట్ ఎలా ఎక్కేస్తున్నారబ్బా అని ఆలోచిస్తుంటారు మిగిలినవారు!

Update: 2024-05-29 02:45 GMT

విమానంలో కొందరు వ్యక్తులు చేసే పనులు, వారి ప్రవర్తన, చేసే విన్యాశాలు ఏ స్థాయిలో వైరల్ అవుతుంటాయనేది తెలిసిన విషయమే. ఇందులో ప్రధానంగా తోటి ప్రయాణికులకు తమ ప్రవర్తన ఎంత ఇబ్బందికు గురిచేస్తుందనే ఇంగితం లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇంత కామన్ సెన్స్ లేనివారు ఫ్లైట్ ఎలా ఎక్కేస్తున్నారబ్బా అని ఆలోచిస్తుంటారు మిగిలినవారు!

విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో చాలా మంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారనేది తెలిసిన విషయమే. ఇందులో భాగంగా... అత్యవసర ద్వారాన్ని తెరవడం, సిబ్బందిని గాయపరచడం, అసభ్యకరమైన పనులు చేయడం, సీట్లలోనే మూత్ర విసర్జన చేస్తుండటం వంటివి ఇటీవల కాలంలో ఎక్కువగానే వినిపించిన పరిస్థితి. ఈ సమయంలో తాజాగా ఒక ప్రయాణికుడు నగ్నంగా పరుగెత్తాడు.

అవును... తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. దీంతో తోటి ప్రయాణికులు ఇతడి విన్యాశాలు చూసి హడలెత్తిపోయారట. అలా నగ్నంగా పరుగెత్తుతూ.. సిబ్బందిని కిందకు తోసేస్తూ తీవ్ర గందరగోళం సృష్టించాడని అంటున్నారు. ఈ ఘటన వర్జిన్‌ ఆస్ట్రేలియా విమానంలో చోటుచేసుకొంది.

వివరాళ్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి వీఏ696 విమానం సోమవారం రాత్రి మెల్‌ బోర్న్‌ కు బయలుదేరింది. ఈ సమయంలో... విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇందులో బ్భాగంగా... విమానం బయలుదేరిన అనంతరం తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు.

ఈ సందర్భంగా తోటి ప్రయాణికులు హడలెత్తిపోగా.. అతడి న్యూడ్ రన్నింగ్ ని సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వారిని కింద పడేసేశాడు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉందని గ్రహించారో ఏమో కానీ... విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారట పైలెట్స్!

ఇదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. ఇలా విమాన సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌ లైన్స్‌ సంస్థ... ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది!

Tags:    

Similar News