ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల వివరాలివే!!

దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు వీరే అనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా వారంతా ఏపీ బీజేపీలో కీలక నేతలు కావడంతో ఈ లిస్ట్ ఆల్ మోస్ట్ ఫైనల్ అని అంటున్నారు!

Update: 2024-03-10 04:32 GMT

వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని టీడీపీ - బీజేపీ నిర్ణయించుకున్నాయి. ఈ పొత్తు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చంద్రబాబు & కో ప్రకటించారు కూడా. ఈ సమయంలో పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయొచ్చనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు వీరే అనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా వారంతా ఏపీ బీజేపీలో కీలక నేతలు కావడంతో ఈ లిస్ట్ ఆల్ మోస్ట్ ఫైనల్ అని అంటున్నారు!

అవును... పొత్తులో భాగంగా బీజేపీ - జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో ఇప్పటికే మూడు స్థానాల్లో జనసేన పోటీ కన్ ఫాం అని అంటున్నారు. ఇందులో భాగంగా మచిలీపట్నం బాలశౌరి, అనకాపల్లి నాగబాబు, కాకినాడ సానా సతీష్ / పవన్ కల్యాణ్ అని అంటున్న నేపథ్యంలో... ఇవి కాకుండానే మరో ఆరు స్థానాల్లో బీజేపీ పోటీ చేయొచ్చని అంటున్నారు.

ఈ క్రమంలో... ఉమ్మడిగా 8 లోక్ సభ స్థానాలు అనేవి కేవలం ఒకవర్గం కావాలని వదిలిన లీకులని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... 6 + 3 మొత్తం తొమ్మిది లోక్ సభ స్థానాల్లో బీజేపీ - జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే 8 మించి ఇవ్వలేమని బాబు భీస్మించుకుని కుర్చుంటే... జనసేన అనకాపల్లిని కూడా త్యాగం చేయడం తప్పకపోవచ్చని అంటున్నారు. అప్పుడు వస్తున్న కథనాలకు న్యాయం చేస్తూ... 6 + 2 లోక్ సభ స్థానాల్లోనే జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది!

ఈ సమయంలో బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల వివరాలు ఇవే అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అవేమిటి.. ఆ అభ్యర్థులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం...!

అరకు - కొత్తపల్లి గీత

రాజమండ్రి - దగ్గుబాటి పురందేశ్వరి

నరసాపురం - రఘురామ కృష్ణంరాజు

తిరుపతి - రత్నప్రభ

రాజంపేట - నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

హిందూపురం - సత్యకుమార్

Tags:    

Similar News