పురందేశ్వరి బిగ్ టీం.. ఏపీలో మార్పు ఖాయమేనా?
బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి.. తనదైన శైలిలో కొత్త టీంను ఎంపి క చేసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు.. నాయకుల ఎంపికలు కూడా అయిపోయి నట్టు సమాచారం.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి.. తనదైన శైలిలో కొత్త టీంను ఎంపి క చేసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు.. నాయకుల ఎంపికలు కూడా అయిపోయి నట్టు సమాచారం. అయితే.. పురందేశ్వరి అంటేనే మహిళా నాయకురాలు కాబట్టి.. తన టీంలో మహిళల కు ప్రాధాన్యం ఉంటుందనే చర్చ తెరమీదకి వచ్చింది. ముఖ్యంగా మూడు ప్రాంతాలకు ముగ్గురు మహిళ లను ఎంపిక చేస్తారని సమాచారం.
ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఏర్పాటు పూర్తయిందని, దీనికి ఢిల్లీ పెద్దలు కూడా ఆమోదం తెలిపారని అంటు న్నారు. ఈ కమిటీలో మూడు ప్రాంతాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని.. అదేవిధంగా సంప్రదాయ ఓట్లను తమవైపు తిప్పుకొనేందుకు కొన్ని ప్రయోగాలు కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. బీసీలు, కాపులకు పురందేశ్వరి పెద్దపీట వేయనున్నట్టు చెబుతున్నారు. ఇక, రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ యథాతథంగా కొనసాగనుందని అంటున్నారు.
విష్ణువర్థన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి వంటి కీలక నేతలకు అనంతపురం, కడప జిల్లాలను అప్పగిస్తారని తె లుస్తోంది. మరోవైపు.. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్.. బండి సంజయ్‌ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్న దరిమిలా ఆయనను ఏపీకి ఇంచార్జ్‌గా నియమించనున్నారనే చర్చ సాగుతోంది. సో.. ఇటు రాష్ట్రంలో పురందేశ్వరి.. అటు కేంద్రంలో అధిష్టానం.. తీసుకునే నిర్ణయాలతో ఏపీ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపించడం ఖాయమని కమల నాథులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.