జగన్‌కు మరింత సింపతీ పోగేస్తున్న పవన్..!
జనసేన అధినేత పవన్ చేస్తున్న వారాహి యాత్ర 3.0పై పార్టీ నాయకులు.. అభిమానుల విశ్లేషణలు ఎలా ఉన్నా.. సాధారణ ప్రజానీకంలో మాత్రం దీనిపై మరో విధంగా చర్చ సాగుతోంది.
జనసేన అధినేత పవన్ చేస్తున్న వారాహి యాత్ర 3.0పై పార్టీ నాయకులు.. అభిమానుల విశ్లేషణలు ఎలా ఉన్నా.. సాధారణ ప్రజానీకంలో మాత్రం దీనిపై మరో విధంగా చర్చ సాగుతోంది. వారాహి యాత్ర ద్వారా పవన్ చెప్పాలని అనుకుంటున్న విషయం ఏంటి? అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ రావడం లేదని అంటున్నా రు. ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో యాత్ర చేసిన పవన్.. (విశాఖలో కొనసాగుతోంది) వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడమే తన ఎజెండాగా చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. వైసీపీని గద్దె దించడం ఒక్కటే తన లక్ష్యమని తాజాగా గాజువాకలో నిర్వహించిన యాత్రలో నూ ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే.. దీనిపైనే విమర్శలు వస్తున్నాయి. తన వ్యక్తిగత అజెండా కేవలం జగన్‌ను అధికారం నుంచి దించడమే అయితే.. ఇంతగా ప్రయాస పడడం ఎందుకు.. ఎన్నికల సమయంలో ఒక పిలుపు ఇస్తే సరిపోతుందిగా అని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కానీ, వారాహి యాత్రల ద్వారా.. ఇటు జనసేన నాయకులు, అటు ప్రజలు కూడా భారీగానే అంచనాలు వేసుకున్నారు. తమకేదైనా మేలు చేసేలా పవన్ వ్యవహరిస్తారని వారు అనుకున్నారు. కానీ, పవన్ ఆదిశగా ఇప్పటికీ దృష్టి పెట్టలేకపోవడం.. తన అజెండా కేవలం జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం అనే కాన్సెప్టును పదే పదే చెబుతుండడంతో.. సాధారణ ప్రజలలో జగన్‌పై మరింత సింపతీ పెరిగేలా వ్యవహరిస్తున్నారా? అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే.. ఏ పార్టీ అయినా.. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని చెప్పా లి. అదేసమయంలో అధికార పార్టీ లోపాలను ఎండగట్టాలి. దీనిలో ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు మొదటిది అత్యంత కీలకం. ఏ పార్టీ అయినా.. ఇదే వ్యూహంతో ముందుకు సాగుతుంది. దీనిని బట్టే ప్రజలు ఆదరించే అవకాశం కూడా ఉంది. కానీ, ఈ విషయం మానేయడం.. కేవలం జగన్‌ను టార్గెట్ చేయడం వల్ల.. అక్కర్లేని సింపతీని జగన్‌కు చేకూర్చినట్టు అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.