అన్న కాంటీన్ Vs డొక్కా సీతమ్మ కాంటీన్ ... డీ అంటే డీ!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-07-02 10:07 GMT

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఇప్పటికే చంద్రబాబు సంతకం చేయగా.. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. ధరల విషయంలో పాత వాటినే కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా.. టిఫిన్ రూ.5, మధ్యాహ్నం భోజనం రూ.5, రాత్రి భోజనం రూ.5 కే అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో... ఐదేళ్ల తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా కూడా పాత ధరలనే కంటిన్యూ చేస్తున్నారనే క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. మరో క్యాంటిన్ల ప్రస్థావన తెచ్చారు.

అవును... జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్న క్యాంటీన్లు పెడుతున్నారు.. వాటిలో కొంతభాగం డొక్కా సీతమ్మ క్యాంటీలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా, నిత్య అన్నదాతగా డొక్కా సీతమ్మ పేరుపొందారని.. కట్టేల పొయ్యపై వండి లంకగ్రామాల్లో సైతం ఎంతో సేవ చేశారని.. అలాంటి మహనీయురాలి సేవలను మనమంతా స్మరించుకోవాలని.. అలాంటివారిని మరిచిపోతే సమాజం విచ్చిన్నమైపోతుందని పవన్ తెలిపారు.

ఇదే సమయంలో... తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికోసం పాటు పడతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇదే క్రమంలో.. పిఠాపురం పేరు ప్రపంచ స్థాయిలో వినిపించినప్పుడే తాను నెగ్గినట్లు భావిస్తానని స్పష్టం చేశారు. ఇక.. సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు పవన్ తెలిపారు.

Tags:    

Similar News

eac