టోఫెల్ పరీక్షకు ఏపీ విద్యార్థులు... జగన్ పై తల్లితండ్రుల ప్రశంసలు!

అవును... ఏపీలో ప్రభుత్వ విద్యావ్యవస్థ విషయానికొస్తే... “జగన్ కి ముందు - జగన్ తర్వాత” అని చెప్పినా అతిశయోక్తి కాదు.

Update: 2024-04-11 12:34 GMT

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశదిశ మార్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. “నాడు – నేడు” అంటూ కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియా విద్యను ప్రవేశపెడితే... విపక్షాల నుంచి ఎదురైన ఎన్నో ఇబ్బందులను అదిగమించిన జగన్ సర్కార్... విద్య ద్వారా మాత్రమే పేదల కుటుంబాల్లో మార్పులు వస్తాయని బలంగా నమ్మారు!

అవును... ఏపీలో ప్రభుత్వ విద్యావ్యవస్థ విషయానికొస్తే... “జగన్ కి ముందు - జగన్ తర్వాత” అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఏపీలో ఐదేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలలను చూసినవారు.. ఇప్పుడు చూస్తే ఏమాత్రం పోలిక లేకుండా మార్పులు జరగడం గమనార్హం. ఇదే సమయంలో అంతర్జాతీయ వేదికలపైనా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల మెరుపులు దర్శనమిచ్చిన అరుదైన సంఘటన జగన్ నాయకత్వంలో సాధ్యమైంది.

ఈ విధంగా... ప్రభుత్వ పాఠశాలలను, అందులోని విద్యా బోధనా తీరుతెన్నులను అమాంతం మార్చేసిన జగన్... పేదల ఇళ్లలో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు! ఇదే సమయంలో టోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు జగన్. ఫలితంగా... అంతర్జాతీయ వేదికలతోబాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు.

ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలమంది పిల్లలు హాజరై తమ ప్రతిభను చూపించారు. ఇందులో భాగంగా 13,104 స్కూళ్లలో 3, 4, 5 తరగతులు చదువుతున్న సుమారు 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు. ఇదే సమయంలో... దీని తర్వాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం భారీ ఎత్తున హారవుతారు!

ఇందులో భాగంగా... 5,907 స్కూళ్ళకు చెందిన 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులు హాజరవుతారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 12న నిర్వహించే పరీక్షకు 16.5 లక్షలమంది పిల్లలు హాజరు అవుతారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మురుగుపరిచిన విద్యాబోధన, ఆంగ్లం మీద పట్టుకోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది.

దీంతో... ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో అద్భుత ఫలితాలు ఇవ్వబోతున్నాయనడానికి ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే అని అంటున్నారు పరిశీలకులు, విద్యార్థుల తల్లితండ్రులు!

Tags:    

Similar News