కృత్రిమ మేధలో మరో కోణం.. డబ్బులే డబ్బులు!

ఇప్పటివరకు ఏఐ అన్నంతనే టెక్నాలజీ అంశాలే చర్చకు వస్తాయి. కానీ..చాలామంది పెద్దగా ఫోకస్ చేయని ఆర్థిక అంశాల్లోకి వెళితే.. 2027 నాటికి ఈ మార్కెట్ సైజ్ భారీగా పెరుగుతుంది.

Update: 2024-02-21 07:30 GMT

కృత్రిమ మేధ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు ఇప్పుడు ప్రతి రంగంలోనూ వినిపిస్తోంది. కొద్ది కాలంగా మొదలైన ఏఐ ఇప్పుడు భారీ ఎత్తున సాగుతోంది. రానున్న రోజుల్లో ఇది టచ్ చేయని రంగం అంటూ ఏమీ లేదు. ఇంతకాలం ఏఐకి సంబంధించి సాంకేతిక అంశాల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కానీ.. దీని వెనుక లక్షల కోట్లు విలువ చేసే మార్కెట్ ఉంది. ఈ టెక్నాలజీని డెవలప్ చేసేందుకు భారీగా ఖర్చు పెట్టిన సంస్థలు.. అంతకు లక్షలాది రెట్ల ఆదాయాన్ని పొందనున్నారు.

ఇప్పటివరకు ఏఐ అన్నంతనే టెక్నాలజీ అంశాలే చర్చకు వస్తాయి. కానీ..చాలామంది పెద్దగా ఫోకస్ చేయని ఆర్థిక అంశాల్లోకి వెళితే.. 2027 నాటికి ఈ మార్కెట్ సైజ్ భారీగా పెరుగుతుంది. డాలర్లలో చెప్పాలంటే 17 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఏఐపై పెట్టుబడులు 2019 నుంచి ఏటా 24 శాతం చొప్పున పెరిగాయి. 2023లో 83 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువగా డేటా అనలిటిక్స్.. జెన్ఏఐ.. ఎంఎల్ అల్గోరిథమ్స్ ప్లాట్ ఫామ్స్ లో పెట్టుబడులు పెడుతున్నట్లుగా రిపోర్టులు తెలిపాయి.

2023లో ఏఐలోకి పెట్టుబడులుఏకంగా రూ.6.89 లక్షల కోట్లు కావటం గమనార్హం. ప్రధానంగా డేటా అనలిటిక్స్.. జేఎన్ ఏఐ.. మెషీన్ లెర్నింగ్.. ఆల్గోరిధమ్ అండ్ ఫ్లాట్ ఫామ్స్ విభాగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి.

మన దేశంలో మాత్రం ఐటీ కంపెనీలు డిజిటల్ కంటెంట్.. డేటా అనలిటిక్స్.. సప్లై చైన్ రంగాలకు ఎక్కువ నిధుల్ని కేటాయిస్తున్నారు. కొన్ని కంపెనీలు కేవలం ఏఐని మాత్రమే వినియోగించటంతోనే సరిపెట్టకుండా.. తమ సేవల తీరును సరికొత్తగా మార్చేయటం గమనార్హం.

మన దేశంలో ఏఐ నిపుణుల సంఖ్య అక్షరాలు 4.2 లక్షలు. ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం కొన్ని సంస్థలు రానున్న మూడేళ్లలో దాదాపు రూ.8300కోట్లకు పైగా నిధుల్ని ఖర్చు చేయనున్నట్లుగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా చూస్తే.. ఏఐ నైపుణ్యాలున్న ప్రతిభావంతులు మన దేశంలో మూడు రెట్లు అధికంగా ఉన్నారు. గడిచిన ఏడేళ్లలో ఏఐ నిపుణుల సంఖ్య 14 రెట్లు పెరిగింది. ఏఐ నిపుణుల విషయంలో టాప్ ఐదు దేశాల్లో భారత్ ఒకటి కాగా.. ఇందులో పెట్టబడులు పెట్టే వారికి సంబంధించి నిపుణులు సంఖ్య 15 శాతం చొప్పున పెరుగుతుంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News