"మీ ఆయన మోడీ.. మోడీ.. అని కలవరిస్తున్నాడా? అన్నం పెట్టడం మానేయండి!"
"మీ ఆయన మోడీ.. మోడీ.. అని కలవరిస్తున్నాడా? అన్నం పెట్టడం మానేయండి!"- అని ఢిల్లీ ముఖ్య మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
"మీ ఆయన మోడీ.. మోడీ.. అని కలవరిస్తున్నాడా? అన్నం పెట్టడం మానేయండి!"- అని ఢిల్లీ ముఖ్య మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీపై ఒంటికాలితో విరు చుకుపడే కేజ్రీవాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. "మీ భర్త మోదీ పేరు జపిస్తే అన్నం పెట్టడం మానేయండి" అని మహిళలకు సూచించారు. ఢిల్లీలో జరిగిన 'మహిళా సమ్మాన్ సమారోహ్' కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రధాని పేరెత్తారు. "చాలా మంది మగవాళ్లు పదేపదే ప్రధాని మోడీ పేరునే జపిస్తారు. ఆయన ఏం చేశాడో కానీ.. మోడీ పేరును జపిస్తారు. ఈ బాధ మీకు తప్పాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీ భర్త ఎప్పుడు మోడీ పేరు జపించినా ఆ రోజు తిండి పెట్టడం మానేయండి" అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
2024-25 బడ్జెట్‌లో భాగంగా కేజ్రీవాల్ సర్కార్ ఓ కీలక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 18 ఏళ్లుపైబడిన మహిళలందరికీ నెలనెలా రూ.1000 ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. మహిళా సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగానే మహిళల్ని ఉద్దేశించి మాట్లాడారు కేజ్రీవాల్. వచ్చే ఎన్నికల్లో ఇంట్లో వాళ్లంతా ఆమ్‌ఆద్మీ పార్టీకే ఓటు వేసేలా తమపై ఒట్టు వేయించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. బీజేపీకి మద్దతునిచ్చే మహిళలతోనూ మాట్లాడాలని, కేజ్రీవాల్ మాత్రం తమకు అండగా నిలబడగలడన్న నమ్మకం ఇవ్వాలని సూచించారు.
"బీజేపీకి మద్దతునిచ్చే మహిళలతో మాట్లాడండి. నేను అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నాను. బస్‌లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు నెలనెలా రూ.1000 ఆర్థిక సాయమూ అందిస్తున్నాం. మరి బీజేపీ ఏం చేసింది..? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి..? ఈ సారి నాకు ఓటు వేయండి. మీ ఇంట్లో వాళ్లంతా మా పార్టీకే ఓటు వేసేలా ఒట్టు వేయించుకోండి" అని కేజ్రీవాల్ అన్నారు.