అంతా 12వ తరగతే !

420 మంది (77 శాతం) గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారని తెలిపింది

Update: 2024-06-06 23:30 GMT

543 మంది ఎంపీలలో అందులో 19 శాతం అంటే 105 మంది 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే చదివారని ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్) రిపోర్ట్ వెల్లడించింది. ఇద్దరు 5వ తరగతి వరకు, నలుగురు 8వ తరగతి వరకు, 34 మంది 10వ తరగతి వరకు, 25 మంది 12వ తరగతి వరకు చదువుకున్నారని వెల్లడించింది.

420 మంది (77 శాతం) గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారని తెలిపింది. నూతన ఎంపీల్లో 17 మంది డిప్లొమా చేశారని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది . ఈ లోక్‌‌సభ ఎన్నికలలో మొత్తం 121 మంది నిరక్షరాస్యులు పోటీ చేయగా వారందరూ ఓటమి పాలయ్యారు.

పీఆర్ఎస్ అనే మేధో సంస్థ లెజిస్లేటివ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం కొత్తగా గెలిచిన ఎంపీలకు వ్యవసాయం, సామాజిక సేవ సాధారణ వృత్తులుగా ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌ ఎంపీల్లో 91 శాతం, మధ్యప్రదేశ్‌ ఎంపీల్లో 72 శాతం, గుజరాత్‌ నుంచి గెలిచిన ఎంపీల్లో 65 శాతం మందికి వారి వృత్తుల్లో వ్యవసాయం ఒకటిగా ఉందని, ఇక ఎంపీలలో 7 శాతం మంది లాయర్లు, 4 శాతం మంది వైద్యులు ఉన్నారని పేర్కొంది.

Tags:    

Similar News