ప్రాణప్రతిష్ఠ ముహూర్తంలోనే కాన్పులు... బుజ్జాయిల పేర్లివే!

అయోధ్యలోని నవనిర్మిత రామాలయంలో బాల రాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే

Update: 2024-01-23 05:59 GMT

అయోధ్యలోని నవనిర్మిత రామాలయంలో బాల రాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు జరిగిన ఈ మహాద్భుతాన్ని వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగా.. కోట్ల మంది పరోక్షంగా వీక్షించారు. అయితే ఆ ముహుర్తానికే తమకు పిల్లలు జన్మించాలని చాలా మంది తల్లితండ్రులు భావించడం గమనార్హం.

అవును... అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన దివ్యముహూర్తంలోనే తమ బిడ్డ జన్మించాలని చాలా మంది దంపతులు కలలు కన్నారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ దివ్యముహూర్తంలోనే బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్న దంపతులు వైద్యులను సంప్రదించి 22-01-24 మధ్యాహ్నం సమయంలో కాన్పు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో సిజేరియన్లకూ సిద్ధమయ్యారని తెలుస్తుంది.

ఆ విధాంగా సుమారు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో బాల రాముడు కొలువుదీరుతున్న రోజునే తమకు బిడ్డ జన్మించాలని భావించారు. అనుకున్నట్లుగానే అలా నిన్న వందంల సంఖ్యలో పిల్లలు జన్మించారని చెబుతున్నారు. అలా పుట్టిన బిడ్డలను చూసి ఆ శ్రీరాముడే తమ ఇంట పుట్టాడని ఆ తల్లితండ్రులు మురిసిపోయారు. తాజాగా వీరికి సంబంధించిన లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా... బిహార్‌ లోని పట్నాలో పలు ఆసుపత్రుల్లో సోమవారం సుమారు 500 మంది శిశువులు జన్మించినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌ లోని మూడు జిల్లాల్లో వివిధ ఆసుపత్రుల్లో అదే సమయంలో... సుమారు 50 మంది శిశువులు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే క్రమంలో... ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని కాన్పుర్‌ గణేశ్‌ శంకర్‌ ఆసుపత్రిలో 25 మందికి కాన్పులు జరిగినట్లు వైద్యులు తెలిపారు.

అదేవిధంగా... కర్ణాటకలోని విజయపురలో జె.ఎస్‌.ఎస్‌. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో సోమవారం సుమారు 20 మంది మహిళలకు కాన్పులు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలా దాదాపు ప్రతీ రాష్ట్రంలోనూ నెలలు నిండిన గర్భవతులు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది. అయితే వీటిలో మెజార్టీ కేసులు సిజేరియన్లే అని అంటున్నారు. ముహూర్త బలం ప్రధానంగా ఈ కాంపులు జరిగినట్లు చెబుతున్నారు.

ఇక అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన రోజున, వీలైతే ఆ సమయాన్న పుట్టిన బిడ్డలకు చాలామంది తల్లితండ్రులు... రామ్‌ అని లేదా ఆ పేరును సూచించే రాఘవ్‌, రఘు, రామేంద్ర, రాఘవేంద్ర లాంటి పేర్లు పెట్టుకున్నారని తెలుస్తుంది. ఇక ఆడపిల్లలలకు జన్మనిచ్చినవారు ప్రధానంగా సీత, జానకీ అనే పేర్లను ప్రిఫర్ చేసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News