బీజేపీని ముగ్గులోకి లాగిన అయ్యన్న

తాజాగా విశాఖలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ మీద కేంద్రం ఎందుకు స్పందించదు అని ప్రశ్నించారు.

Update: 2023-09-13 12:55 GMT

ఇప్పటిదాకా తెలుగుదేశం వర్గాలలో ఏమైన డౌట్లు అంతర్గతంగా ఉన్నాయో ఏమో తెలియదు కానీ రాజకీయ విశ్లేషకులతో పాటు వామపక్షాలు అంతా కూడా చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీ మీదనే అనుమానపు చూపులు చూస్తున్నారు. బీజేపీ పెద్దల గ్రీన్ సిగ్నల్ లేకపోతే చంద్రబాబు లాంటి దిగ్గజ నేతను అరెస్ట్ చేసే సీన్ ఏపీ ప్రభుత్వానికి లేదని కూడా అంటూ వచ్చారు.

సీపీఐ నారాయణ అయితే ఓపెన్ గానే ఆ విషయం చెప్పుకొచ్చారు. ఇక తాజాగా నారా లోకేష్ ని ఇంటర్వ్యూ చేసిన ఆంగ్ల మీడియా కూడా బీజేపీ చోద్యం చూస్తోంది కదూ అంటూ లోకేష్ ని రెట్టించారు. అయినా లోకేష్ దానికి జవాబు అయితే చెప్పలేదు. ఇలా బీజేపీ మీదనే అంతా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

విపక్షాల విషయానికి వస్తే తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా బీజేపీ కేంద్రంలో చేస్తున్నదే ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు అనేశారు. అలాగే యూపీకి చెందిన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా ఇదే మాట అంటూ బీజేపీ హ్యాండ్ బాబు అరెస్ట్ వెనక ఉందని అతి పెద్ద డౌట్ నే వ్యక్తం చేశారు.

వారూ వీరూ అనడం ఒక ఎత్తు ఇపుడు టీడీపీకి చెందిన సీనియ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనడం అంటే అది నిజంగా టీడీపీ వాయిస్ గానే చూడాలా అన్న చర్చ మొదలైంది. తాజాగా విశాఖలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ మీద కేంద్రం ఎందుకు స్పందించదు అని ప్రశ్నించారు.

బాబు వంటి బిగ్ షాట్ ని అరెస్ట్ చేస్తే కేంద్రం స్పందించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతటితో ఆగని అయ్యన్న బాబు అరెస్ట్ వెనక కేంద్రం పాత్ర ఏమైనా ఉందా అంటూ డైరెక్ట్ గానే ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవీ కేంద్రానికి కనిపించడంలేదా అని కేంద్రాన్ని అయ్యన్న నిలదీశారు.

కేంద్ర నిధులు పక్క తోవ పడుతున్నా కూడా కేంద్రం ఎందుకు నోరు మెదపడంలేదని కూడా ఆయన ప్రశ్నించారు. అయ్యన ఆవేశం వెనక ఆయన మాటల వెనక చాలానే విషయాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో రాజకీయం అధికార విపక్షాల మధ్య సాగుతూ ఉంటుంది. ప్రతీ దాని మీద కేంద్రం స్పందిస్తుందా అన్నది కూడా మరో వాదన ఉంది.

తమ సొంత పార్టీకి చెందిన తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ ని అరెస్ట్ చేసినపుడు కూడా కేంద్ర పెద్దలు రియాక్ట్ కాలేదని గుర్తు చేస్తున్న వారూ ఉన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ తో విపక్ష బీజేపీ ప్రతీ రోజూ యుద్ధమే చేస్తూ ఉంటుంది. అదే టైం లో బీజేపీ వారి మీద దాడులు అరెస్టులు అక్కడ నిత్యకృత్యంగా ఉంటాయి. అక్కడ కూడా బీజేపీ పెద్దలు స్పందించడంలేదు కదా అని అంటున్న వారూ ఉన్నారు.

అయితే ఏపీ రాజకీయాలలో బాబు అరెస్ట్ ఇపుడు జాతీయ రాజకీయాల మీద కూడా నెమ్మదిగా ప్రభావం చూపిస్తోంది. దాంతో బాబు అరెస్ట్ మీద బీజేపీ రియాక్ట్ కావాల్సిందే అని అంటున్న వారు పెరుగుతున్నారు. టీడీపీ సీనియర్ నేత ఇలా డైరెక్ట్ గా అడడం అంటే మాత్రం ఆలోచించాల్సిందే. బీజేపీ తో టీడీపీ రైలేషన్స్ ని ఫ్యూచర్ పొత్తులను ప్రభావితం చేసేలాగానే అయ్యన్న హాట్ కామెంట్స్ ఉన్నాయని అంతుననరు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News