పని మొదలుపెట్టిన అయ్యన్న... జగన్ కు షాకిచ్చే ఫైల్ పై సంతకం!

అనంతరం నూతన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తొలిరోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-06-22 13:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ తొలిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా... ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.

ఈ సందర్భంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ తో పాటు రఘురామ కృష్ణంరాజు మొదలైన నేతలు అయ్యన్నపై ఆసక్తికరంగా స్పందించారు.. కీలక విషయాలు వెల్లడించారు. అనంతరం నూతన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తొలిరోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కీలక ఫైల్ పై సంతకం చేశారు. ఇది జగన్ కు షాకిచ్చే నిర్ణయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును.. నూతన శాసనసభాపతిగా ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు తొలిరోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వంలో మూడు ఛానెళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేసే ఫైలుపై సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

సీనియారిటీ ఉండటం వల్లే చంద్రబాబు తనకు ఈ పదవి ఇచ్చారని అన్నారు.. ఈ నేపథ్యంలో సభను హుందాగా, గౌరవంగా నడపడానికి ప్రయత్నిస్తానని అయ్యన్న తెలిపారు. ఈ సందర్భంగా తన తొలినాటి రాజకీయానుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు అయ్యన్న. ఇందులో భాగంగా... ఎన్టీఆర్ హయాంలో తాను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు తమకు ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు.

ఈసారి అసెంబ్లీలో సుమారు 88మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్న తెలిపారు. సభలో ప్రవేశపెట్టే బడ్జెట్, క్వశ్చన్ అవర్, జీరో అవర్ వంటి విషయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక జగన్ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్ష హోదా ఆయనకు లేదని తేల్చి చెప్పారు అయ్యాన్న.

Tags:    

Similar News