జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్... నెట్టింట 'థాంక్స్' సందడి!

వీదివీధినా జగన్ బర్త్ డే ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయని అంటున్నారు.

Update: 2024-12-21 07:12 GMT

అవును... మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. "బర్త్ డే గ్రీటింగ్స్ జగన్ గారూ" అని అంటూ... "మంది ఆరోగ్యం, దీర్ఘాయుషు పోందాలని ఆకాక్షించారు. గత ఏడాది కూడా వైఎస్ జగన్ బర్త్ డేకి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పుడు దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా ఈ ట్వీట్ కి సంబంధించిన కామెంట్ సెక్షన్ లో "థాంక్యూ సీబీఎన్ గారు", "థాంక్యూ సీఎం గారు", "థాంక్యూ బాబుగారు" అంటూ జగన్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా కనిపిస్తున్న 'జిఫ్'లు నెట్టింట సందడి చేస్తున్నాయి.

ఇదే సమయంలో.. వైఎస్ జగన్ కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు.. దేవుడు జగన్ కు మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుషు ఇవ్వాలని.. ప్రజా సేవలో సుదీర్ఘ కాలం ఉండాలని ఆకాంక్షించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా... చాలా చోట్ల రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్లు పంపిణీ, వృద్ధులకు శీతాకాలానికి సంబంధించిన దుస్తులు పంపిణీ చేతున్నారు.

Tags:    

Similar News