ఏపీలో జంపింగులకు ప్రేమ లేఖలు..!
అందుకే మండలిలో కనీస బలం తెచ్చుకునేందుకు టీడీపీ సహా కూటమి పార్టీల్లోకి జంప్ చేసేవారిని.. ప్రోత్సహిస్తున్నారనేది పొలిటికల్ రూమర్.
పార్టీలు మారి వచ్చే వారు.. రెడీ అయ్యారు. వైసీపీ నుంచి హీన పక్షం.. మండలిలో 10 మంది వరకు టీడీపీ బాటపట్టనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. మండలిలో టీడీపీజంపింగులను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పార్టీకి బలం లేదు. దీంతో ప్రభుత్వ పరంగా చేసే బిల్లులు ఇక్కడ వీగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మండలిలో కనీస బలం తెచ్చుకునేందుకు టీడీపీ సహా కూటమి పార్టీల్లోకి జంప్ చేసేవారిని.. ప్రోత్సహిస్తున్నారనేది పొలిటికల్ రూమర్.
సహజంగానే ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీ నుంచి జంప్ చేసేవారు ఉంటారు. అయితే.. ఇటీవల కాలంలో ఇది ఫ్యాషన్ గా కూడా మారిపోయింది. ఇక, అధికార పక్షం నుంచి ఆహ్వానించేవారు కూడా ఉంటారు. సో.. ఇప్పుడు కావాల్సింది.. వారి వ్యాపారాలు.. వ్యవహారాలు సక్రమంగా సాగుతాయని భావించిన వారు.. అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలోనూ ఇప్పుడు అదే పంథా కొనసాగుతోంది. ఇక, ఏపీలో మాత్రం రాజకీయాలు ఎందుకు భిన్నంగా ఉంటాయి.
కాబట్టి జంపింగులకు ఇప్పుడు చక్కని ఛాన్స్ చిక్కుతోందని పొలిటికల్ కారిడార్లలో చర్చ సాగుతోంది. ఇక, ఇలా వచ్చేవారిని రాజీనామాలు చేయాలని కోరుతున్నట్టు చంద్రబాబు స్వయంగా చెప్పారు. అంటే..వారు రాజీనామాలు చేసి వచ్చాక.. వారికి ఆయా పదవులే ఇస్తే.. మంచిదే. కానీ, ఎక్కడైనా తేడా కొడితే.. అది మరో ఇబ్బంది. అయితే.. ఇలా జంపింగుల కారణంగా.. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న తమ్ముళ్లు నిరాశలో ఉన్నారు. తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. జనసేన నాయకులు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వచ్చేవారు.. నేరుగా వచ్చి నా.. చేర్చుకుంటార? లేక.. టీడీపీ చెబుతున్నట్టు రాజీనామాలు చేసి రావాలా? అనేది ప్రశ్నగా మారింది. ఇక, బీజేపీ విషయాన్ని తీసుకుంటే.. రాజ్యసభ సభ్యులకు వల విసురుతున్నారు. కేంద్రంలోని పెద్దల ద్వారానే వారు చక్రం తిప్పుతున్నారు. దీంతో బీజేపీ కూడా ప్రేమ లేఖలు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోం ది. ఏదేమైనా.. రాష్ట్రంలో జంపింగుల గోల కొన్నాళ్లు సాగే అవకాశం కనిపిస్తోంది.