బాబుకు బెయిల్ వద్దు...జైలులో ఇంకెన్నాళ్ళు....?

లేటెస్ట్ గా చూస్తే సుప్రీం కోర్టులో జరిగిన వాదనలో కూడా బెయిల్ మీకు కావాలా ని కోర్టు ప్రశ్నించినపుడు మాకు బెయిల్ వద్దు అని చంద్రబాబు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా చెప్పారని అంటున్నారు.

Update: 2023-09-27 18:10 GMT

చంద్రబాబు జైలులో ఉండడానికి ఇన్ని రోజుల పాటు ఉండడానికి కారణం జగన్ ప్రభుత్వం అని టీడీపీ తిట్టిపోస్తోంది. కానీ కాస్తా బుర్ర పెట్టి ఆలోచిస్తే ఆయన తరఫున న్యాయవాదులు వేస్తున్న పిటిషన్లు వాటి వెనక టీడీపీ పెద్ద ఆలోచనలు ఆకాంక్షలు అన్నీ మిళితం అయి ఉండడం వల్లనే బాబు జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారని అని అంటున్నారు.

లేటెస్ట్ గా చూస్తే సుప్రీం కోర్టులో జరిగిన వాదనలో కూడా బెయిల్ మీకు కావాలా ని కోర్టు ప్రశ్నించినపుడు మాకు బెయిల్ వద్దు అని చంద్రబాబు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా చెప్పారని అంటున్నారు. పైగా మాకు రిలీఫ్ కావాలని ఆయన వాదన వినిపించారు.

ఇక క్వాష్ పిటిషన్ అంటూ వేయడం ద్వారా బాబుకు అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కాం తో సంబంధం లేదని ఆయన్ని అనవసరంగా ఇరికించారని వాదిస్తున్నారు. దాంతో పాటు 409, సెక్షన్ 17 ఏ మీదనే సుప్రీం కోర్టులో కూడా వాదనలు వినిపించారు.

ఇవన్నీ టెక్నికల్ గ్రౌండ్ లో ఉన్నవే. వీటి మీదనే ఏసీబీ కోర్టు, హై కోర్టులో వాదనలు వినిపించినా ఫలితం లేకపోయింది. కానీ చంద్రబాబు మీద ఏపీ సీఐడీ పెట్టిన కేసుని మొత్తం కొట్టేయాలనే మొదటి నుంచి టీడీపీ పోరాడుతోంది. అందుకే బాబు జైలు జీవితం అలా పెరిగిపోతోంది అంటున్నారు.

బెయిల్ తీసుకుని బాబు బయటకు వస్తే అవినీతి కేసులో ఆయన ఉన్నట్లే. ఇక సీఐడీ విచారణకు కూడా హాజరవుతూ ఉండాలి. అపుడూ తనకూ జగన్ కి తేడా ఏముందని భావించే చంద్రబాబు క్వాష్ పిటిషన్ మీద పట్టుబడుతున్నారు అంటున్నారు. ఇక బాబు కుటుంబ సభ్యులు ఒక వైపు పందొమ్మిది రోజులైంది ఆయన జైలులో ఉంటున్నారు అని జనంలో చెబుతున్నారు. సానుభూతి కోసం కూడా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే స్టైట్ గా ఇక ప్రశ్న వేస్తున్నారు. మేము కడిగిన ముత్యాలమని చెప్పుకునే చంద్రబాబు లోకేష్ ఎందుకు కేసుని ఎదుర్కోరు అని నిలదీశారు. ఎంతసేపూ వేరే విధంగా ఆలోచించడం కంటే కేసుని ఎదుర్కొంటే నిజాయతీతో బయటపడవచ్చు కదా అని ఆయన సూచిస్తున్నారు. సమస్యను జఠిలం చేసుకుంటున్నది చంద్రబాబే అని కూడా ఆయన నిందించారు.

మొత్తానికి చంద్రబాబు జైలు జీవితం ఎన్నాళ్ళు అంటే దానికి వైసీపీ ప్రభుత్వం కంటే బాబు తరఫున వాదించే న్యాయవాదులే జవాబు చెప్పాలని కూడా అంటున్నారు. ఇక సుప్రీం కోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేస్తే అపుడు బెయిల్ కోసం ఎటూ బాబు ప్రయత్నించక తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసులో ఈడీ జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు రంగంలో ఉండడ కేసులో బలం ఉండడం వల్లనే ఇలా జరుగుతోంది అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా బాబు కేసులో బెయిలా లేక క్వాష్ పిటిషన్ కొట్టివేతా అన్నది కొద్ది రోజులు ఆగితే కానీ తేలదు, అప్పటివరకూ బాబు జైలులోనే ఉంటారని చెప్పవచ్చు.

Tags:    

Similar News